NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్‌కు రాజ‌కీయం నేర్పిస్తున్న బీజేపీ?!

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌రిపాల‌న ప‌గ్గాలు కైవ‌సం చేసుకున్న వైఎస్ఆర్‌సీపీ గురించి గ‌త కొద్దికాలంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతున్న సంగ‌తి తెలిసిందే.

బీజేపీకి వైసీపీ ఎంతో ద‌గ్గ‌ర అని పేర్కొన‌డ‌మే కాకుండా ఒక ద‌శ‌లోబీజేపీ నాయ‌క‌త్వంలోని ఎన్డీయే కూట‌మిలో వైసీపీ చేర‌బోతోంద‌ని కూడా జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే, ఆ ప్రచారం కేవ‌లం ప్ర‌చారంగానే ముగిసింది. వైసీపీ విష‌యంలో బీజేపీ వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతోంద‌ని తాజా ఘ‌ట‌న‌ల‌ను పేర్కొంటూ ప‌లువురు విశ్లేషిస్తున్నారు.

పోల‌వ‌రం విష‌యంలో….

ఏపీకి వ‌ర‌ప్రదాయిని అనే పేరున్న పోలవరం ప్రాజెక్టు విష‌యంలో బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోంద‌ని ప‌లువురు విశ్లేషించారు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్లో రూ.2,234.288 కోట్లను ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఆ మేరకు నిధులను బహిరంగ మార్కెట్‌ ద్వారా సమీకరించి.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా ఏపీ ప్రభుత్వానికి ఇవ్వాలని నాబార్డుకు కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ ఎల్కే త్రివేది ఆదేశాలు జారీ చేశారు. పీపీఏ నిర్ధారించిన ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగానికి తెలియజేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖకు సూచించారు.

వీర్రాజు దూకుడు చూశారా?

ఈ నిధుల విడుద‌ల ఆదేశాల నేప‌థ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆస‌క్తిక‌రంగా స్పందించారు. `పోల‌వ‌రం బ‌కాయిలను బేష‌ర‌తుగా విడుద‌ల చేయాల‌న్న కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణ‌యంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు ధ‌న్య‌వాదాలు. ఈ ఆదేశాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రైతుల ప‌ట్ల న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వానికి ఉన్న చిత్త‌శుద్ధికి నిద‌ర్శ‌నం“ అని ట్వీట్ చేశారు.

 

అస‌లేం జ‌రిగింది?

పోల‌వ‌రం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన నిధులను కేంద్రం రీయింబర్స్‌ చేయడంలో జరుగుతున్న ఆలస్యం పోలవరం పనులపై పడుతోందని కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది. ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తే ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను పీపీఏ కూడా బలపరిచింది. దాంతో ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రాజెక్టు పనులకు విఘాతం కలగకుండా నిధులను విడుదల చేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించింది. ఈ క్రమంలో గత నెల 12న జారీ చేసిన షరతును ఉపసంహరించుకుంది. కాగా, ఈ విష‌యంలో క్రెడిట్‌ను బీజేపీ సొంతం చేసేందుకు ఏపీ బీజేపీ ఛీఫ్ ట్వీట్ చేశార‌ని అంటున్నారు. సీఎం జ‌గ‌న్‌కు బీజేపీ రాజ‌కీయం రుచి చూపిస్తున్నార‌ని చెప్తున్నారు. అయితే, ఏపీకి ద‌క్కాల్సిన ఇత‌ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో కూడా బీజేపీ నేత‌లు ఇదే త‌ర‌హాలో వేగంగా స్పందించాల‌ని ప‌లువురు కామెంట్ చేస్తుండ‌టం కొస‌మెరుపు.

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N