NewsOrbit
న్యూస్

ఆధార్ ను కూడా..! లాక్/అన్ లాక్ చేయవచ్చు..!!

 

 

ఆధార్ ప్రతి భారతీయుడికి ఎంతో అవసరం అయినా వ్యక్తిగత గుర్తింపు కార్డు. ఈ ఆధార్ కార్డులో ప్రతి పౌరుడి పూర్తి సమాచారం కలిగి ఉంటది. 12 అంకెళ్ళతో ఉండే ఈ ఆధార్ కార్డు, ఎన్నో అధికారిక పనులకు అత్యంత ప్రధానమైన డాక్యుమెంట్ గా అయిపోయింది.బ్యాంకు ఖాతా తెరవడం, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం, ప్రభుత్వ రాయితీలను పొందటానికి ఈ ఆధార్ కార్డు ఎంతో అవసరం అయిపోయింది.

 

ఆధార్ గుర్తింపు సంఖ్య మీకు చాలా సేవలను అందిస్తుంది. దీనికి సంబంధించిన చాలా పనులు దాని ఆన్‌లైన్ పోర్టల్ “uidai.gov.in ” లో పొందవచ్చు. అయితే ఒక్కోసారి ఈ ఆన్‌లైన్ సేవలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బయో మెట్రిక్ ద్వారా ఆధార్‌ను దుర్వినియోగం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకుగాను హ్యాకర్ల నుంచి మీ ఆధార్ ను రక్షించడానికి బయోమెట్రిక్ వివరాలను లాక్ చేయవచ్చు, లేదా అన్‌లాక్ చేసుకోవచ్చు అన్ని యూ.ఐ.డి.ఎ.ఐ తెలిపింది. మీరు మీ బేస్ లో బయోమెట్రిక్ లాక్ ద్వారా ఆధార్ కార్డును లాక్ చేయవచ్చు. దీన్ని లాక్ చేయడానికి లేదా అన్‌లాక్ చేయడానికి సౌకర్యాన్ని కూడా కల్పించింది.

ఆధార్‌లోని బయోమెట్రిక్ లాక్ అంటే మీ వేలిముద్ర, ఐరిస్ డేటాను లాక్ చేయడం. అయితే మీరు మీ ఆధార్ కార్డు లాక్ చేయడానికి ముందు మీరు దాని వర్చువల్ ఐడి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆధార్ కార్డును లాక్ చేసిన తరువాత కేవైసి ( KYC) ని ఫిల్ చేయడానికి మీకు వర్చువల్ ఐడి అవసరం చాలా ఉంటుంది. ఈ విధంగా మీ ఆధార్ కార్డను లాక్ లేదా అన్ లాక్ చేయవచ్చు. బయోమెట్రిక్ లాక్ అయిన తర్వాత, ఆధార్ హోల్డర్ లేకుండా మరే వ్యక్తి ప్రామాణీకరణ కోసం ఉపయోగించలేరు. ఆధార్ హోల్డర్లు అవసరమైనప్పుడు దాన్ని అన్‌లాక్ చేయవచ్చు. ఈ సేవ యొక్క ప్రయోజనం పొందడానికి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కలిగి ఉండటం అవసరం.

ఆధార్ ను బయోమెట్రిక్ లాక్/అన్‌లాక్ చేయడం ఎలా..
– యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ)యొక్క అధికారిక వెబ్‌సైట్, “https://uidai.gov.in/” ని సందర్శించండి

-మై ఆధార్ ఆప్షన్ ను ఎంచుకోవాలి

-ఆధార్ సేవల లాక్ / అన్‌లాక్ బయోమెట్రిక్‌పై క్లిక్ చేయండి

-బయోమెట్రిక్ లాక్ ఆప్షన్ ను ఓపెన్ చేసిన తర్వాత, నేను బయోమెట్రిక్‌లను అన్‌లాక్ చేసే వరకు బయోమెట్రిక్ ను ఉపయోగించలేను అది నాకు అంగీకారమే, అనే సందేశాన్ని క్లిక్ చేసి,
ఆపై లాక్ / అన్‌లాక్ బయోమెట్రిక్స్ పై క్లిక్ చేయండి.

-మీ 12-అంకెల ఆధార్ కార్డ్ నంబర్ మరియు క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.

-ఓటీపీ రిక్వెస్ట్ ను క్లిక్ చేయండి

-మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి

-‘లాకింగ్ ఫీచర్‌ను ప్రారంభించు ‘పై క్లిక్ చేయండి

బయోమెట్రిక్ విజయవంతంగా లాక్ చేయబడిన తరువాత, ఏ ప్రామాణీకరణ ప్రయోజనాల కోసం ఇది ఉపయోగించబడదు.

మీరు లాక్ చేసిన బయోమెట్రిక్ డేటాను పైన వివరించిన విధానాన్ని పాటించి అన్‌లాక్ చేయవచ్చు, తద్వారా మీరు మీకు అవసరం అయినపుడు ఆధార్ కార్డు బయోమెట్రిక్ సేవలను ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. అలాగే లాక్‌ను శాశ్వతంగా నిలిపివేయడానికి లాకింగ్ ఫీచర్‌ను ఆపివేయిపై క్లిక్ చేయండి. మీరు దాన్ని మళ్ళీ లాక్ చేసే వరకు, మీ ఆధార్ బయోమెట్రిక్స్ శాశ్వతంగా నిలిపివేయబడుతుంది

Related posts

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella