NewsOrbit
న్యూస్

వాట్సాప్ లో కొత్త ఫీచర్ ఏంటో..! మీకు తెలుసా..!!

 

 

సోషల్ మీడియా యాప్ లు ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్ వంటివి చాలానే ఉన్నప్పటికీ. ప్రస్తుత రోజులలో ప్రజలు త్వరిత మెసేజ్లను పంపడానికి ఎక్కువగా వాట్సాప్ ను మాత్రమే ఉపయోగిస్తున్నారు. ప్రపంచం మొత్తం మీద వాట్సాప్ లో ప్రతిరోజూ సుమారు 100 బిలియన్ మెసేజ్లను పంపుతున్నట్లు తాజా నివేదిక తెల్పుతుంది. వాట్సాప్ ద్వారా పంపే మెసేజ్ల సంఖ్యకు దగ్గరలో మరే ఇతర మెసేజింగ్ సర్వీస్ యాప్ లేకపోవడం గమనార్హం.ఇది ఇలా ఉంటె, ఫేస్‌బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ రోజు రోజుకూ సరికొత్త అప్‌డేట్స్‌తో యూజర్ల ముందుకొస్తోంది. వినియోగదారుల సమాచార భద్రతే ప్రాధాన్యంగా రకరకాల ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది.

 

వాట్సాప్ యాప్ ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చడానికి వాట్సాప్ కొత్త ఫీచర్లను జోడిస్తోంది. వాట్సాప్ ఇటీవల “ఆల్వేస్ మ్యూట్” ఫీచర్ ద్వారా వినియోగదారులకు, చాట్ నోటిఫికేషన్లను ఎప్పటికీ మ్యూట్ చేసే సామర్థ్యాన్ని ఇచ్చింది. తాజాగా పలు గ్రూపులు, వ్యక్తుల నుంచి వచ్చి పడుతున్న మెసేజ్‌లను, ఫోటోలను, వీడియోలు తదితర కంటెంట్‌ను సులువుగా తొలగించేందుకు వీలుగా ఒక కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తుందని వాట్స్అప్ అధికారులు తెలిపారు.

తద్వారా పలుసార్లు ఫార్వార్డ్ చేసిన, అనవసరమైన వీడియోలను, ఫొటోలను క్లీన్ చేసుకునేందుకు మరింత సులభంగా తొలగించుకోవచ్చు. 5ఎంబీ కంటే ఎక్కువ సైజులో ఉన్న ఫైలును గుర్తిస్తుంది. అలాగే పరిమాణంలో ఫైల్ సైజ్‌ను బట్టి విడివిడిగా చూపిస్తుందని, దాని ద్వారా అవసరమైన వాటిని, అనవసరమైన వాటిని వినియోగదారులు త్వరగా గుర్తించగలుగుతారని సంస్థ చెప్పింది. అంతేకాకుండా ఒకటి లేదా చాలా వాటిని డిలీట్ చేయడానికి ముందు ఒకసారి చూసుకునే వెసులుబాటును కల్పిస్తుందని అన్నారు. అయితే ఈ ఫీచర్ ప్రపంచ వ్యాప్తంగా ఈ వారంలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. యాప్‌లోని స్టోరేజి అండ్ డేటా సెట్టింగ్స్ లో ఈ ఫీచర్ కనిపిస్తుందని సంస్థ తెలిపింది. ఇప్పటివరకూ వాట్సాప్ ‘స్టోరేజ్ యూసేజ్’ విభాగం కింద చాట్‌లు కనిపించేవి. తాజా ఫీచర్‌ అందుబాటులోకి వచ్చాక ఇంటర్‌ఫేస్‌మీద ఒక బార్‌మీద కనిపిస్తుంది. ఇందులో మీడియా కంటెంట్ ద్వారా ఎంత స్టోరేజ్‌ వినియోగించాం అనేది చూపించడంతోపాటు, చాలాసార్లు ఫార్వార్డ్ చేయబడిన మీడియా ఫైళ్ళను ప్రత్యేకంగా చూపించడం ద్వారా అలాంటి ఫైళ్ళను సులభంగా గుర్తించి డిలీట్‌​ చేయడానికి సహాయపడుతుంది.

ఇది కాకుండా, వాట్సాప్ స్టోరేజ్ మరింత క్లియర్ చేయడానికి కొత్త, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లక్షణాన్ని కూడా జోడించింది. మీకు వచ్చిన పర్సనల్ మెసేజెస్, గ్రూప్స్ మెసేజెస్ ఏడు రోజుల వరకే కన్పిస్తాయి. ఆ తర్వాత ఆయా మెసేజెస్ మీ వాట్సాప్ హిస్టరీలో కనిపించవు. ఈ మెసేజింగ్ ఫీచర్ను వెబ్, ఆండ్రాయిడ్, ఐఓఎస్, కైయోస్ వాట్సాప్ యూజర్లకు అందుబాటులో ఉంచింది.

Related posts

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?