NewsOrbit
న్యూస్

కుప్పంలో కూడా కుంపటి పెట్టిన వైసిపి!బాబుకు ఇంక నిద్రలేని రాత్రులేనా!

టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ముప్పై సంవత్సరాలుగా పాతుకుపోయిన కుప్పం నియోజకవర్గంలో పాగా వేయడానికి వైసిపి ప్రయత్నాలు మొదలెట్టింది.

వాస్తవానికి చంద్రబాబు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా చంద్రగిరి కాగా 1978 లో కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడ గెలిచి 1983 లో ఓడారు.తదుపరి టిడిపిలో చేరిన చంద్రబాబునాయుడు 1985 ఎన్నికల్లో పోటీ చేయలేదు.1989 నుండి కుప్పంను తన నియోజకవర్గంగా మార్చుకొని అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్నారు.అయితే మొన్నటి ఎన్నికల్లో ఆయన మెజారిటీ దారుణంగా పడిపోయింది. ఒకటి రెండు రౌండ్లలో వైసిపి అభ్యర్థి కంటే వెనకబడి కూడా పోయారు.దీన్ని పరిగణనలోకి తీసుకున్న వైసీపీ అధినాయకత్వం వచ్చే ఎన్నికల్లో కుప్పంలోకూడా గెలుపొందాలని టార్గెట్గా పెట్టుకున్నదంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారట.

ఇందులో భాగంగా కుప్పంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఒక్కరికీ అందేలా చేయాలని ఒక పథకం ప్రకారం వైసిపి ముందుకెళుతోంది.ఇన్నిసార్లు చంద్రబాబును గెలిపించినా, ఆయన దాదాపు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వున్నా కుప్పం నియోజకవర్గం అభివృద్ధిలో బాగా వెనకబడిపోయింది అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వైసిపి కృషి చేస్తోంది. దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్న కుప్పం అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.కుప్పం నియోజకవర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై జగన్ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ నుండి ప్రత్యేక నివేదిక కూడా తెప్పించుకుంటున్నారు.వీటినన్నిటి పరిష్కరించడం ద్వారా కుప్పంలో చంద్రబాబుకు స్థానం లేకుండా చేయాలన్నది వైసిపి ప్రభుత్వ లక్ష్యం.

అలాగే కుప్పం నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్లను వైసీపీ వైపు ఆకర్షించే ప్రయత్నాలు కూడా లోపాయికారిగా జరిగిపోతున్నాయి.ఈ సమాచారం అందడంతో చంద్రబాబు కూడా అప్రమత్తమయ్యారు.కుప్పం నియోజకవర్గానికి హంద్రీ నీవా ప్రాజెక్టు నీరు చేరే విధంగా చర్యలు తీసుకోవాలంటూ వైసిపి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ఒక పాదయాత్ర చేసేలా టిడిపి శ్రేణులను చంద్రబాబు పురిగొల్పారు.ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో గృహ నిర్బంధాలు ,అరెస్టులు కూడా జరిగాయి.అంతేగాక అవసరమైతే కుప్పం నియోజకవర్గంలో సొంత నిధులతో బడుగు బలహీనవర్గాలకు గృహాలు నిర్మించి ఇచ్చి వారి ఓటు బ్యాంకు చేజారకుండా చూసేందుకు చంద్రబాబు పథకం సిద్ధం చేసుకున్నారని టాక్.మొత్తం మీద చూస్తే కుప్పం నియోజకవర్గంలో కూడా రాజకీయ కుంపటి రాజుకుంది.

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju