NewsOrbit
టెక్నాలజీ న్యూస్

కారులో ఈ చిన్న వస్తువు మార్చకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే..?

 

ప్రస్తుతం కార్ల వినియోగం ఎక్కువగా ఉంది. ప్రతి 10 మందిలో ఇద్దరు కచ్చితంగా కారు వినియోగిస్తున్న వారే. చాలామందికి ఏంటంటే కొత్తగా వాహనం తీసుకున్నాను. కానీ మైలేజ్ ఎక్కువగా రావడం లేదు అంటుంటారు. దానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..!

ఎయిర్ ఫిల్టర్ శుభ్రం చేసుకోకపోయినా, మార్చకపోయినా దాని పర్యవసనాలు మైలేజ్ పైన పడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఫైర్ ఇంజన్ లో ఫైర్ జరగాలంటే సరిపోయినంత గాలి వెళ్లాలి అలా వెళ్లకపోతే ఎక్కువగా ఫ్యూయల్ తీసుకొని తక్కువ గాలిని తీసుకుంటుంది. మనిషి శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే మాదిరిగానే, కారు ఇంజన్ లోకి వచ్చే గాలిని శుద్ధి చేసేదే ఎయిర్ ఫిల్టర్. ఇంజన్లో ఇది కీలకమైన భాగం.

ఎయిర్ ఫిల్టర్ ఉపయోగాలు

ఉదాహరణకు ఇంజన్ ఒక లీటర్ ఇంధనాన్ని మండించాలంటే దానికి పది వేల రెట్ల స్వచ్ఛమైన గాలి అవసరం. ఫిల్టర్ చేయబడిన గాలి సాయంతో ఇంజన్లో ఇంధనం మరింత స్పష్టంగా మండుతుంది. ఫలితంగా ఇంజన్ సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా దుమ్ము, ధూళి నుంచి కాపాడుతుంది. మంచి ఎయిర్ ఫిల్టర్ వలన ఇంజన్ సామర్థ్యం తో పాటుగా మైలేజ్ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఇంజన్ నుంచి వెలువడే కర్బన ఉదాఘరాలను తగ్గించేందుకు, మంచి యాక్సిలరేషన్ కోసం, ఇంజన్ జీవితకాలం పెంచేందుకు, కార్ పర్ఫామెన్స్ మెరుగుపరిచేందుకు ఇది ఉపయోగపడుతుంది.

ఫిట్ చేసుకోవడం ఎలా

దీన్ని మార్చడం కోసం రెండు నిమిషాల వ్యవధి పడుతుంది. చిన్న స్క్రూ డ్రైవర్ తో బిగించుకోవచ్చు. దీని ధర కేవలం 400 రూపాయలు మాత్రమే. తరచూ మట్టిరోడ్లు దుమ్ము ధూళి ఎక్కువగా ఉండే రోడ్లపై తిరిగే కార్లలో
20-30 శాతం వరకు మైలేజ్ చూపిస్తుంది.
పూర్తిగా ఎయిర్ ఫిల్టర్ పాడైపోతే 40 శాతం వరకు మైలేజ్ పడిపోతుంది. ఎక్కువగా కార్ ను ఉపయోగిస్తే ప్రతి మూడు నెలలకోసారి మార్చుకుంటే ఫలితాన్ని మీరే చూడ అవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎయిర్ ఫిల్టర్ ను మార్చడం మర్చిపోకండి. ఎయిర్ ఫిల్టర్, ఇంజిన్ ఆయిల్, కూలంట్ ఆయిల్ మార్చకపోతే మనమే మన ఇంజన్నీ పాడు చేసుకున్నట్లు. దీని వలన మొదట పిక్ అప్ డ్రాప్ అవుతుంది. తర్వాత పవర్ లాక్ అవుతుంది. చివరికి ఇంజన్ పై లోడు పడి బోర్ పాడవుతుంది. ఇంత చిన్నది మార్చుకోకపోతే ఎంత పెద్ద ప్రమాదమో చూశారా. ఇకనైనా ఎయిర్ ఫిల్టర్ ను మూడు నెలలకి లేదా పీరియాడికల్ సర్వీస్ చేయించుకున్నప్పుడు ఖచ్చితంగా మార్చుకోండి.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?