NewsOrbit
సినిమా

‘మెగాస్టార్ చిరంజీవి’ కోసం.. మరోసారి ఉరికిన అభిమానం..!

fans showed their affection on chiranjeevi again

మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ బేస్ స్థాయి గురించి తెలిసిందే. ధియేటర్ల హవా  మాత్రమే ఉన్న రోజుల్లో చిరంజీవి సినిమా ఓపెనింగ్స్, కలెక్షన్లు, సినిమా రన్, ఫ్యాన్స్ హంగామా.. ఇవన్నీ ఓ సెన్సేషన్. వేరే హీరో బ్లాక్ బస్టర్ సినిమా కలెక్షన్లు చిరంజీవి ఫ్లాప్ సినిమాకు వచ్చేవని ఇండస్ట్రీనే అనేది. దర్శకుడు గుళ్లో పూజలు చేసి సినిమా బాక్సులు తీసుకెళ్లడం.. సినిమా హిట్ అవ్వాలని దేవుడికి మొక్కడం చేసేవారు. 1995లో అల్లుడా మజాకా సినిమాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధమైనప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 200 లారీల్లో ఫ్యాన్స్ హైదరాబాద్ వచ్చి తన నిరసన తెలిపారు. ఇప్పుడు అదే ఫ్యాన్స్ చిరంజీవి కోసం మళ్లీ దేవాలయాల్లో పూజలు, యాగాలు చేశారు.. కారణమేమిటంటే..

fans showed their affection on chiranjeevi again
fans showed their affection on chiranjeevi again

చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఆయనే చెప్పారు. దీంతో ఆయన కుటుంబసభ్యులతోపాటు ఇండస్ట్రీ, అశేష అభిమానులు ఆందోళన చెందారు. వెంటనే చిరంజీవి ఫ్యాన్స్ మళ్లీ కదిలారు. అఖిల భారత చిరంజీవి యువత, రాష్ట్ర చిరంజీవి యువత కదిలింది. వారి ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల్లోని చిరంజీవి అభిమానులు స్థానిక దేవాలయాల్లో.. చిరంజీవి ఇష్టదైవం ఆంజనేయస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. చిరంజీవి త్వరగా కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని హైదరాబాద్, ఏలూరు, రాజమండ్రి.. ఇలా ప్రతి చోటా అభిమానులు పూజలు యాగాలు చేశారు. ఈరోజు శుక్రవారం విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో చండీ యాగం, కుంకుమ పూజ చేయించారు. డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ చెన్నైలోని రాఘవేంద్ర స్వామి ఆలయంలో చిరంజీవి కోసం ప్రత్యేక పూజ చేశారు.

ఇలా.. చిరంజీవి అభిమానులు ఎప్పుడూ ఆయన వెన్నంటే ఉన్నారు. ఆమధ్య అమరావతి విషయంలో కొందరు చిరంజీవి ఇంటిని ముట్టడిస్తామని ప్రకటించారు. ఆ సమయంలో కూడా రెండు రాష్ట్రాల నుంచి అభిమానులు చిరంజీవి ఇంటికి చేరుకుని ఆయనకు కోటగా నుంచున్నారు. ప్రస్తుతం చిరంజీవి తనకు కరోనా నెగటివ్ రిపోర్ట్స్ వచ్చాయని.. ఫాల్టీ కిట్ వల్లే నెగటివ్ రిపోర్ట్స్ వచ్చాయని తెలిపారు. తనకోసం పూజలు చేసిన వారందరికీ, అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. దీంతో చిరంజీవి అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. BOSS is BACK అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella