NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

నివేదికలకు పోల’వరాలు’ వస్తాయా పవన్ ? : ప్రశ్నించడం ఇదేనా!!

 

 


పోలవరం మీద నిపుణులు, జర్నలిస్టులు, ఇతర మేధావులతో చర్చించి ఒక నివేదిక తయారు చేసి కేంద్రానికి ఇస్తాం. దాని మీద కేంద్రానికి నిజానిజాలు తెలియజేస్తాం అని జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళగిరి సమావేశంలో చెప్పడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది. పవన్ నివేదిక ఇస్తే కేంద్రం నిధులు మంజూరు చేస్తుందా? లేక ఆయన నివేదిక ఏమైనా బ్రహ్మాస్త్రంగా పని చేస్తుందా అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలు అయ్యాయి. వైస్సార్సీపీ కార్యకర్తలు ఒక అడుగు ముందుకు వేసి గతంలో ఆయన రాష్ట్రానికి కేంద్రం అందించిన నిధులపై రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి, నివేదిక అందజేస్తే డైకి ఇదే బీజేపీ ప్రభుత్వం ఎం స్పందించిందో చెప్పాలని, పవన్ పోరాటాలు అన్ని ఇలాగే ఉంటాయని ఎద్దేవా చేస్తున్నారు. అయితే జన సైనికులు మాత్రం అసలు పోలవరం జరిగిన అక్రమాలు, జరగాల్సిన పనులపై ఒక పార్టీ అధ్యక్షుడి హోదాలో నివేదిక అందజేయడం తప్పేలా అవుతుంది అని ప్రశ్నిస్తున్నారు.

పోరాటాలతోనే పోలవరం

పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టుపై ఎన్నో నివేదికలు, మరెన్నో నిపుణుల పరిశీలనలు, వాదోపవాదాలు, నిధుల కోసం ఆరాటాలు, పునరావాస పోరాటాలు జరిగాయి. ఎప్పుడు కొత్తగా దీని మీద తెలుసుకోవాల్సింది ఏమి లేదు. జరగాల్సిన పనులే ఉన్నాయి. విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించిన పోలవరం కథ మొత్తం తిరుగుతుంది అని అంత భవిచారు. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం దీనిలో అనవసర జోక్యం చేస్కుని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మించుకుంటామని చెప్పడంతోనే పోలవరం అధోగతి మొదలు అయ్యింది. ఎప్పటికి అప్పుడు అంచనాలు ఇష్టానుసారం పెంచేస్తూ, వచ్చిన డబ్బును ఇతర అవసరాలకు మళ్లిస్తూ అప్పటి టీడీపీ ప్రభుత్వం చేసిన విసజయలను ఎన్నికల వేళ నరేంద్ర మోడీ సైతం పోలవరం టీడీపీకు ఏటీఎం అయ్యింది అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుని చర్చకు దారి తీశాయి. ముందు దీనిలో లోపాలు ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే. ఎలాంటి పనులు చేపట్టాలి..? ఎంత మేర నిధులు అవసరం అనేది కేంద్రం వద్ద డేటా ఉంది. దాన్ని మళ్ళీ పవన్ నివేదిక రూపంలో చెప్పక్కర్లేదు. ఎప్పుడు పోలవరం మీద ఉమ్మడిగా అన్ని పార్టీలను కలుపుకుని కేంద్రం మీద పోరాటం చేస్తేనే దీనిలో కదలిక వస్తుంది. పోలవరం పోరాటాన్ని ప్రజా పోరాటంగా మలిస్తేనే ప్రాజెక్ట్ పూర్తి అనేది వచ్చే తరం ఐనా చూడగల్గుతుంది.

వీటిని ప్రస్తావించాలి?

1 . కేంద్రం పోలవరం అంచనాలను ఎందుకు ఒప్పుకోవడం లేదు . కేంద్ర జలవనరుల శాఖా ఆమోదం తెలిపిన 2017 – 18 ధరల ప్రకారం 55 , 656 కోట్లను ఎందుకు సవరించారు. కేవలం కమిటీ పేరుతో 47 , 725 కోట్లకు ఎందుకు తగ్గించారు. ఇది కూడా ఇవ్వబోమని 2013 – 14 అంచనాల మేరకు మాత్రమే నిధులు ఇస్తామని కేవలం అప్పటి అంచనాలు 29 , 027 కోట్లను ఇస్తామని, దీనిలో తాగునీరు, నిర్మాణం మాకు సంబంధం లేదని చెప్పి, మళ్ళీ అందులో కొత్త పెట్టి కేవలం 20 , 396 కోట్లను మాత్రమే ఇస్తామని మొండిగా వెళ్లడం వాళ్ళ పోలవరం పూర్తి అయ్యే అవకాశం లేదు.
2 . 2014 వరకు ఖర్చు చేసిన నిధులు పోను ఇటీవల కేంద్రం ఇచ్చిన 6 , 614 నిధులు పోను, ఇంకా 7 , 054 కోట్లను ఇచ్చి చేతులు దులుపుకుందామని కేంద్రం భావిస్తుంది. దీని వాళ్ళ జాతీయ ప్రాజెక్ట్ ఎలా సాధ్యం.
3 . ప్రాజెక్టులో కీలకమైంది పునరావాసం 373 గ్రామాలకు చెందిన లక్ష అయిదు వేల కుటుంబాలకు పునరావాసం కల్పించాలి . దీనిలో ఎప్పటి వరకు కనీసం అయిదు వేల కుటుంబాలకు ఒక దారి చూపలేకపోయారు. పునరావాసం మీద కేంద్రం వైఖరి ఏంటి?
4 . 2013 – 14 ధరల ప్రకారం నిధులను కేంద్రం ఇస్తే అది ప్రాజెక్ట్ నిర్మాణానికి మాత్రమే సరిపోతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం పునరావాసానికి అయ్యే సుమారు 33 వేల కోట్లు భరించగలదా?
5 . ఉత్తరాఖండ్ కు చెందిన రెండు జాతీయ ప్రాజెక్టులను, యమునా మీద నిర్మించబోయే జాతీయ ప్రాజెక్టుకు పూర్తిస్థాయి నిధులు ఇస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం పోలవరానికి నిధులు ఇవ్వడంలో ఎందుకు వెనకడుగు వేస్తుంది?
6 . చంద్ర బాబు హయాంలో పోలవరం నిధుల మీద అవినీతి జరిగితే దానిపై విచారణ చేసి ముందుకు వెళ్ళాలి తప్ప , ఎందుకు ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రశ్నర్ధకం చేస్తున్నారు?
ఎలాంటి ఎన్నో ప్రశ్నలు, పోరాటాలు ఉండగా మళ్ళీ నివేదిక తీసుకువెళతామని పవన్ కళ్యాణ్ చెప్పడం ఆయన కు ఉన్న అవగాహనా లోపం తో పాటు, బీజేపీ మీద మాట్లాడే ధైర్యం లేకపోవడమే అని రజక్ఖేయ్య సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది.

Related posts

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?