NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వామ్మో ఎంఐఎం కొత్త వ్యూహం అస‌లు లెక్క ఏంటో తెలుసా?

ఎంఐఎం పార్టీ నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అధికార టీఆర్ఎస్‌ పార్టీని ప్ర‌స్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగ‌తి తెలిసిందే. 4700 ఎకరాల హుస్సేన్ సాగర్ ఈరోజు కనీసం 700 ఎకరాలు కూడా లేదని అన్నారు.

 

హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఉన్న అక్రమ కట్టడాలను కూల్చేస్తామని ప్రభుత్వం చెప్తోందని, హుస్సేన్ సాగర్ కట్టపై ఉన్న పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చాలని అక్బరుద్దీన్ అన్నారు. అసెంబ్లీలో మీ తోక ఎలా తొక్కాలో మాకు బాగా తెలుసు అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

కేటీఆర్ ఫీల‌య్యాడు బాస్‌

మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్‌లపై మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన అనుచితమైన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అక్బరుద్దీన్‌ వివాదాస్పద వ్యాఖ్యలపై కేటీఆర్‌ ట్విటర్లో స్పందించారు. ‘ప్రముఖ నాయకులు పీవీ నరసింహారావు, ఎన్టీఆర్‌లు కూడా తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులు. ఒకరు ప్రధానిగా, మరొకరు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారు. అటువంటి మహానాయకులపై అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలకు చోటులేదని’ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

టీడీపీ నిర‌స‌న

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఘాట్‌లను కూల్చివేయాలంటూ.. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో ఎంఐఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు టీడీపీ శ్రేణులు. గ్రేటర్ ఎన్నికల వేళ మత విద్వేశాలను రెచ్చగొట్టేలా టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల నేతలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిన ఎన్టీఆర్, పీవీ నరసింహారావుపై చేసిన వ్యాఖ్యలకు ఎంఐఎం నేతలు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎంఐఎం వ్యూహం ఏంటి?

జీహెచ్ఎంసి ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారం జోరుగా జరుగుతున్నది. అన్ని పార్టీలు గెలుపుపై ధీమాతో ప్రచారం నిర్వహిస్తున్న స‌మ‌యంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యల లెక్క ఏంట‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ మిత్ర‌ప‌క్ష‌మైన ఎంఐఎం ఇలా కామెంట్ చేయ‌డం వెనుక ఎంఐఎం సానుభూతిప‌రుల ఓట్లు త‌మ ఖాతాలోనే ఉంచుకునే వ్యూహం ఒక‌ట‌ని , టీఆర్ఎస్‌తో తాము దూరం పాటిస్తున్నామ‌నే సిగ్న‌ల్స్ ఇవ్వ‌డం మ‌రొక‌టి అని అంటున్నారు.

Related posts

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N