NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

క‌రోనా క‌ల‌క‌లం…. ఏపీలో ఓ రికార్డు

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టిస్తున్న క‌రోనా క‌ల‌క‌లం విష‌యంలో ఏపీ ఓ ప్ర‌త్యేక‌త‌ను సృష్టించింది. కోవిడ్ నివారణకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు తీసుకుంది. దాని ఫ‌లితంగా ప్ర‌త్యేక రికార్డు సాధించింది.

రాష్ట్రంలో కోవిడ్‌ పరీక్షల సంఖ్య 1,00,00,000 (కోటి) దాటింది. ఆదివారం ఉదయం 9 గం. సమయానికి 1,00,17,126 పరీక్షలు పూర్త‌య్యాయి.

వేగంగా ఏర్పాట్లు ….

ఏపీ ప్ర‌భుత్వం వైరస్ వ్యాప్తి నివారణకు అత్యంత వేగంగా పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. పక్కాగా కార్యాచరణను అమలు చేసింది. నాడు వైరస్‌ను నిర్ధారించే స్థితిలో లేని రాష్ట్రంలో ఇప్పుడు 150 ల్యాబ్‌లలో కోవిడ్‌ పరీక్షలు చేస్తున్నారు. కరోనా వైరస్‌ను గుర్తించిన నాటి నుంచి అప్రమత్తంగా వ్యవహరిస్తూ, వైద్య పరీక్షలతో పాటు, క్వారంటైన్, ఐసొలేషన్, ఆస్పత్రుల్లో చికిత్స, ఆ తర్వాత రోగులు కోలుకున్న తర్వాత వారిని సురక్షితంగా ఇళ్లకు చేర్చడం వరకు ప్రతి అంశంలో ప్రత్యేకత నిలుపుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆ ప్రక్రియలో మరో కీలక అడుగు ముందుకు వేసింది.

టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్

ఏపీ ప్ర‌భుత్వం క‌రోనా వైర‌స్ వ్యాప్తి విష‌యంలో క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రించింది. వీలైనన్ని చోట్ల కరోనా వైద్య పరీక్షలు నిర్వహించడం, పాజిటివ్‌ కేసులు గుర్తిస్తే వెంటనే వారికి క్వారంటైన్‌ లేదా ఐసొలేషన్‌ చేయడం, అవసరమైతే ఆస్పత్రుల్లో చికిత్స చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం చురుకుగా వ్యవహరిస్తోంది. చికిత్స అనంతరం వారిని ప్రభుత్వమే సురక్షితంగా ఇళ్లకు చేరుస్తోంది. అందుకే తక్కువ వ్యవధిలోనే కోటి వైద్య పరీక్షల మైలురాయిని దాటి ఒక రికార్డు సృష్టించింది.

ఎక్కడెక్కడ ఈ పరీక్షలు?

రాష్ట్రంలో తొలుత కరోనా పరీక్షలకు అనువైన ల్యాబ్స్‌ లేకపోవడం వల్ల, ఫిబ్రవరి 1న తొలి శాంపిల్‌ను తెలంగాణలోని గాంధీ ఆస్పత్రికి పంపించారు. ఆ తర్వాత రాష్ట్రంలో తొలి కరోనా పరీక్ష మార్చి 7న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్‌)లో నిర్వహించారు. తొలి దశలో కేవలం స్విమ్స్‌లో మాత్రమే కరోనా వైద్య పరీక్షలు నిర్వహించే సదుపాయం ఉండగా, ఆ తర్వాత వేగంగా పలు చోట్ల ఆ సదుపాయం ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మొత్తం 150 ల్యాబ్‌లలో కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 15 చోట్ల కరోనా వైద్య పరీక్షల కోసం సదుపాయాలు కల్పించారు. శ్రీకాకుళం రిమ్స్, విశాఖపట్నం ఏఎంసీ, కాకినాడ ఆర్‌ఎంసీ, విజయవాడ ఎస్‌ఎంసీ, గుంటూరు జీఎంసీ, ఒంగోలు రిమ్స్, నెల్లూరు ఏసీఎస్‌ఆర్‌ జీఎంసీ, తిరుపతి స్విమ్స్, తిరుపతి ఎస్వీఆర్‌ఆర్‌జీహెచ్, కడప రిమ్స్, కర్నూలు కేఎంసీ, అనంతపురం జీఎంసీ, ఏలూరు అస్రమ్, విజయనగరం మిమ్స్, మంగళగిరి ఎయిమ్స్‌లో కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు, 4 ప్రైవేటు ల్యాబ్‌లలో (కర్నూలు, తిరుపతి, విజయవాడ, తాడేపల్లి) కూడా కరోనా వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇంకా 90 ట్రూనాట్‌ ల్యాబ్స్, 6 సీబీనాట్, 5 నాకో, 5 సీఎల్‌ఐఏ ల్యాబ్‌లతో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో 44 వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌లు పని చేస్తున్నాయి. వాటన్నింటిలో కలిపి రోజుకు 70–75 వేల వైద్య పరీక్షలు చేసే స్థాయికి రాష్ట్రం చేరుకుంది. శాంపిళ్ల సేకరణకు 122 బస్సులలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది.

ఎన్ని రోజుల్లో ఎన్ని పరీక్షలు?:

రాష్ట్రంలో తొలి లక్ష పరీక్షల నిర్వహణకు 59 రోజుల సమయం పట్టింది. ఆ తర్వాత జూలై 5వ తేదీ ఉదయం నాటికి పరీక్షల సంఖ్య 10 లక్షలు దాటగా, ఆదివారం (నవంబరు 29వ తేదీ) ఉదయం 9 గంటల సమయానికి ఆ సంఖ్య కోటి మైలు రాయి దాటి రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు 1,00,17,126 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో 8,67,683 కేసులు పాజిటివ్‌గా తేలాయి. 91,49,443 కేసులు నెగిటివ్‌గా నమోదయ్యాయి.

Related posts

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N