పవర్ స్టార్ కల్యాణ్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిన విషయమే. వకీల్ సాబ్ ఫస్ట్ మోషన్ పిక్ రిలీజ్ అయితేనే ఎంత హడావిడి జరిగిందో చూశాం. పవన్ కు కథ నచ్చితే కొత్త దర్శకుడా.. ఇతర భాషా దర్శకుడా అనేది చూడరని ఓ టాక్ ఉంది. అలా.. ఆయన కొత్త దర్శకులను కూడా పరిచయం చేసి సూపర్ హిట్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇటివల పవన్ పాలిటిక్స్ లో బిజీగా ఉంటూనే వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సినిమాలు లైన్లో.. మరో రెండు సినిమాలు కమిట్ మెంట్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ మరో సినిమా అంగీకరించాడని ఇప్పుడు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది.
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ ఓ సినిమా చేయబోతున్నాడని ఇండస్ట్రీలో ఓ టాక్ బాగా వైరల్ అయింది. ఈమేరకు పవన్ కు ఓ లైన్ కూడా వినిపించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. కథ లైన్ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసేందుకు జానీ మాస్టర్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. అయితే.. జానీ మాస్టర్ కు ఈ అవకాశం కల్పించింది రామ్ చరణ్ అంటున్నారు. పవన్ అంటే జానీ మాస్టర్ కు ప్రత్యేక గౌరవం ఉంది. చరణ్ గతంలో జానీ మాస్టర్ కు ఆర్ధికంగా, వ్యక్తిగతంగా సాయం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చరణ్ కు కథ వినిపించగా బాబాయికి పక్కాగా సరిపోతుందని సూచించినట్టు తెలుస్తోంది.
అన్నీ పక్కాగా వర్కౌట్ అయితే ఈ సినిమాను రామ్ చరణ్ తన నిర్మాణ సారధ్యంలోనే ఈ సినిమాను తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ప్రస్తుతానికి గాసిప్ గా ఉన్న ఈ వార్తపై రామ్ చరణ్ గానీ, జానీ మాస్టర్ నుంచి గానీ అఫీషియల్ న్యూస్ రివీల్ కావాల్సిందే. ఇదే నిజమైతే డ్యాన్స్ మాస్టర్స్ గా రాణిస్తూ దర్శకులైన ప్రభుదేవా, లారెన్స్ సరసన జానీ మాస్టర్ నిలిచే అవకాశం ఉంది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!