తెలుగు చలన చిత్ర పరిశ్రమను కరోనా భారీగా దెబ్బ తీసిన తర్వాత యువనటుడు సత్యదేవ్ నటించిన సినిమాలన్నీ వరుసగా డిజిటల్ రిలీజ్ లు అయిపోయాయి. కేవలం ఆరు నెలల వ్యవధిలో అతను మూడు సినిమాలు రిలీజ్ చేశాడు. ఇక ఈ మధ్య కాలంలో అతనికి వచ్చిన పేరు వల్ల గువ్వ గోరింక చిత్రాన్ని కూడా నిర్మాతలు అదే ఊపులో రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలైన ఈ చిత్రం 2017 లో పూర్తయింది. మొత్తానికి ఎన్ని రోజులకి ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
కథ
శిరీష (ప్రియా లాల్) కు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అంతే కాకుండా ఆమె వయొలిన్ వాయించడం లో మాస్టర్స్ చేస్తుంటుంది ఇక అదే సమయంలో అసలు శబ్దం అంటే పడని సదానంద్ (సత్యదేవ్) శిరీష పక్కనే ఉండే ఫ్లాట్ లో చేరుతాడు. ఇక వీరిద్దరూ ఒకరినొకరు చూసుకోకుండానే వాదించుకోడం మొదలు పెడతారు. అయితే నిదానంగా ఇద్దరి మనసులు ఒక్కటై అది కాస్తా స్నేహానికి దారితీస్తుంది. తర్వాత సదానంద్.. శిరీష ఆమె తండ్రి చూసిన వాడిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడింది అని తెలిసి ఆమె నుండి దూరంగా వెళతాడు. ఇక మిగిలిన కథ అంతా వారు తమ భావాలను ఎలా వ్యక్త పరుస్తూ ఉంటారు…. ఇద్దరు ఒకరినొకరు కలవకుండానే చివరికి తన ప్రేమను ఎలా చెప్పుకుంటారు అన్నదానిపై ఉంటుంది.
ప్లస్
సత్యదేవ్, ప్రియా లాల్ పర్ఫార్మెన్స్
సురేష్ బొబ్బిలి మ్యూజిక్
రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కామెడీ.
మైనస్ లు
రొటీన్ ప్రేమకథ
సరిగ్గా పండని ఎమోషన్ లు
బోరింగ్ స్క్రీన్ ప్లే
సినిమా నిడివి
అనుభవం లేని దర్శకత్వం
విశ్లేషణ :
మొదటిగా సినిమా కథనానికి గువ్వా గోరింక అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అయితే ఈ సినిమాలో ఉండే బోరింగ్ స్క్రీన్ ప్లే, ఆకట్టుకొని నరేషన్ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. టెక్నికల్ గా ఈ చిత్రం చాలా బాగుంది .మ్యూజిక్ ను సురేష్ బొబ్బిలి అద్భుతంగా అందించాడు. అలాగే రంగస్వామి సినిమాటోగ్రఫీ కూడా చాలా గొప్పగా ఉంటుంది. సాంబశివరావు ఆర్ట్ డైరెక్టర్ గా ఫ్లాట్ డిజైన్ చేసిన తీరు ను బాగా మెచ్చుకోవచ్చు. కానీ ఎడిటింగ్ మాత్రం మరికొంత మెరుగు పడాల్సి ఉంది. ఒక 30 నిమిషాలు షార్ట్ ఫిలిం కు అవసరమయ్యే కథ జు రెండు గంటల పాటు దర్శకుడు మోహన్ సాగదీసిన విధానం ప్రేక్షకులకు ఖచ్చితంగా బోర్ కొట్టేస్తోంది. మొదటి 20 నిమిషాల్లోనే ప్రేక్షకుడికి సినిమా సామర్ధ్యత అర్థం అయిపోతుంది.
చివరి మాట : గువ్వ… బోరింక
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!