NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌కీయాలు

రాయలసీమ నరుకుడు × గోదావరి లో ప్రమాణం : ఇదే తేడా, అదే రాజకీయం

 

 

**రెండు రోజుల క్రిందట రెండు కీలకమైన విషయాలు జరిగాయి… చాలామంది దీన్ని గ్రహించరు గానీ… రాష్ట్రంలో ఎప్పుడూ జరగని రాజకీయాల్లో కీలక విషయాలు అవి… రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రాజకీయాలు.. అక్కడి నాయకుల స్వభావం… కార్యకర్తల ప్రవర్తన ఎలా ఉంటుంది అని చాటి చెప్పే గొప్ప రెండు విషయాలు అవి…. డీప్ గా రాజకీయాలు పరిశీలించే వారే దీన్ని గమనించి ఉండవచ్చు అని మా భావన.. రాజకీయాలు గోదావరి జిల్లాల్లో ఎలా ఉంటాయి అదే రాయలసీమ కి వచ్చేసరికి ఎలా మారుతాయి అనే దానికి రెండు రోజుల్లో వరుసగా జరిగిన ఘటనలు చక్కటి ఉదాహరణలు… ఈ రెండు ప్రాంతాల్లో కార్యకర్తలు నాయకులు కాదు రాజకీయాలు వారు ప్రవర్తించే తీరు సైతం ఎంత మారిపోతుంది అని చాటి చెప్పే చక్కటి రెండు ఉదంతాలు జరిగాయి. రాయలసీమ ప్రాంతాన్ని గొడ్డళ్ళత… గోదావరి ప్రాంతాన్ని గోబ్బేమ్మ లతో ఎందుకు చూపుతారో చెప్పే రాజకీయ సీతరాలివి……

**రెండు రోజుల కిందట తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం వైస్సార్సీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి పై అదే నియోజకవర్గం నుంచి గతంలో టిడిపి తరఫున ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పలు అవినీతి ఆరోపణలు చేశారు. కడపర్తి నియోజకవర్గం లోని కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యే సారా బట్టీలు పెట్టించారని… గ్రావెల్ వ్యాపారం జోరుగా సాగుతోంది అని… ప్రతి పథకం లోనూ ప్రతి అభివృద్ధి కార్యక్రమంలోనూ ఎమ్మెల్యే ముడుపులు తీసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే పై ఆరోపణలు చేశారు… ఈ ఆరోపణల పర్వం గత రెండు నెలలుగా జోరుగా సాగుతోంది. ప్రతిసారి మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేయడం దానికి ప్రతిగా ప్రస్తుత ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి కౌంటర్లు ఇవ్వడం.. అది మీడియా పతాకస్థాయిలో రావడం నియోజకవర్గంలో చర్చకు దారి తీసింది… వీరి పరస్పర ఆరోపణలు శృతిమించి పెద్దవి కావడంతోపాటు.. సవాలు చేసుకునే స్థాయికి మీరు వచ్చారు… అయితే ఆ సవాలు గోదావరి జిల్లా స్థాయి లోనే ఉంది.. గోదావరి జిల్లాల్లో ఎక్కువగా నమ్మే బిక్కవోలు మహాగణపతి ఆలయం లో ఎవరి మీద ఆరోపణలు ఏది నిజమో ఎంత తీసుకున్నారో ఎంత అక్రమంగా సంపాదించారో ప్రమాణాలు చేద్దామని ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సవాలు చేసుకున్నారు… రెండు రోజుల క్రితం ఇరువురు తమ సతీమణితో సహా బిక్కవోలు మహా గణపతి ఆలయానికి వచ్చి ప్రమాణాలు చేశారు.. తర్వాత అక్కడ ఎదురుపడిన వీరిద్దరూ కొద్దిసేపు తిట్టుకొని… పోలీసుల సాయంత్రం ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు.. ఇది గోదావరి స్టైల్…

** గురువారం అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం రణరంగం అయింది… అనంతపురంలో ఎప్పటినుంచో జేసీ ఫ్యామిలీకి కేతిరెడ్డి ఫ్యామిలీ కి మధ్య ఉన్న విభేదాలు మరోసారి జిల్లాలో వెలుగు చూశాయి. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏకంగా జెసి ఇంటికి వెళ్లి అక్కడున్న జెసి ప్రభాకర్ రెడ్డి కూర్చునే కుర్చీ లో కూర్చుని ఉండడంతో పాటు అక్కడున్న జేసి అనుచరులు సైతం ఎదిరించి వారిని భయపెట్టి వెళ్లడం దాంతోపాటు… జేసీ అనుచరులు కేతిరెడ్డి అనుచరులు పరస్పర దాడులు చేసుకోవడం, ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే పరిస్థితి వచ్చింది. ఈ గొడవకు అంతటికీ ఒక చిన్న ఫోన్ కాల్ మాత్రమే కారణం. ఇసుక రవాణా విషయంలో అనుమతులు రావాలంటే కచ్చితంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భార్యకు తగిన ముడుపులు ఇస్తేనే ఇసుక వస్తుందని చెబుతూ ఫోన్ లో మాట్లాడిన మాటలు ఇటు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడమే కేతిరెడ్డి పెద్ద రెడ్డి ఆగ్రహానికి కారణం.. ఏకంగా ఓ ఎమ్మెల్యే తన ప్రత్యర్థి ఇంటికి వెళ్లడం తో పాటు.. అక్కడ బీభత్సం సృష్టించడం దానికి ప్రతిగా వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగి.. సవాలు చేయడం సై అన్నట్టు మాట్లాడడం పెద్ద వివాదానికి దారితీస్తుంది. గతంలోనే కేతిరెడ్డి కుటుంబానికి ఇటు జెసి కుటుంబానికి మధ్య ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి. ఇప్పుడు ఒక చిన్న ఫోన్ కాల్ మళ్లీ ఇరు కుటుంబాల మధ్య చిచ్చు రేపింది. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సీమ రాజకీయాల్లో ఇప్పుడు ఇది పెద్దవార్… ఒక చిన్న ఫోన్ కాళ్లు పట్టుకునే పెద్ద సీన్ క్రియేట్ చేసిన సీమ రాజకీయాలు ఇలా ఉంటాయి… ఇది రాయలసీమ స్టైల్..

Related posts

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju