NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌కీయాలు

లోకేష్ లో పరిణతి… టీడీపీకు శుభ గతి!!

 

 

టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు రాజకీయాల్లోకి వచ్చి ఎలాంటి ఎమ్మెల్యే పదవి లేకుండానే మంత్రి పదవి చేశారంటూ… కనీసం మాట్లాడటం చేతకాదు అంటూ… నాయకులను పార్టీ నడిపించడం తీరు తెలియదు అంటూ… ఆయన రూపం మాట అనే విషయంపై రకరకాల సెటైర్లు వేస్తూ… రాజకీయాల్లో అత్యంత నీచమైన భాషను లోకేష్ మీద ప్రయోగించిన రాజకీయ నాయకులు ఆయనలో క్రమంగా వస్తున్న పరిణతి చూసి ముక్కున వేలేసుకుంటున్నారు… ఎంతో హుందాగా విమర్శలు చేస్తూ, అంతే హుందాగా పార్టీ కార్యకర్తల పట్ల తాము ఉన్నామని నిరూపిస్తూ ఆయన కడప జిల్లా ప్రొద్దుటూరు లో గత రెండు రోజులుగా చేస్తున్న పర్యటన ఆసాంతం విజయవంతమైనట్లు చెప్పుకోవాలి… ఇది నిజంగా టిడిపి శ్రేణులకు కార్యకర్తలకు ఓ బలాన్ని ఇచ్చింది… లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించి దాన్ని ప్రాజెక్ట్ చేయడంలోనూ టీడీపీ శ్రేణులు విజయం సాధించారు…

 

ఇదే స్పందన కొనసాగించాలి!!

ప్రొద్దుటూరు లో ఇళ్ల పట్టాల పంపిణీ స్థలంలోనే హత్యకు గురైన టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి సుబ్బయ్యా హత్య కేసులో… ఆయన కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పడం లో లోకేష్ విజయం సాధించారు… ఇది కేవలం సుబ్బయ్య కుటుంబ సభ్యులకే కాదు తెలుగుదేశం క్యాడర్ మొత్తాన్ని ఉత్సాహాన్ని నింపింది.
** ఓ కార్యకర్త కు ఏదైనా కష్టం వస్తే తాము ఉన్నామని పార్టీ అధినేత దగ్గరనుంచి ఓ భరోసా వస్తే ఆ కుటుంబానికి ఎంతో సంతోషం అది మిగిలిన కార్యకర్తలకు బలం చేకూరుస్తుంది. కడప జిల్లాలో గత మూడు రోజులుగా లోకేష్ పర్యటన ఆసాంతం ఇదే చెప్పింది. తుది అంత్యక్రియల్లో ను లోకేష్ పాల్గొని… ఈ కేసులో కీలకంగా ఉన్న ఎమ్మెల్యే రాచమల్లు పేరు కమిషనర్ పేరు.. ఎఫ్ఐఆర్లు నమోదు చేయించచడంలో లోకేష్ విజయం సాధించారు. ఆ కేసు నిలుస్తుందా లేక నిలవాదా?? అన్నది పక్కన బెడితే కేసులో కీలకంగా, కీలకమైన ఆరోపణలు టిడిపి చేసిన ఎమ్మెల్యే కమిషనర్ పేర్లు మాత్రం ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం లోకేష్ మొండితనం గానే చెప్పాలి.
** అత్యంత సున్నితమైన ప్రాంతం.. అందులోనూ సీఎం సొంత జిల్లాలో ఈ విషయం పెద్దది కాకుండా వెంటనే పోలీసులు వారిద్దరి పేర్లను ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. దీనిలో లోకేష్ విజయం అని చెప్పుకున్న.. ఆయన కీలక సమయంలో స్పందించిన తీరు ఒక రాజకీయ చతురత ఎంతో బావుంది. అయితే ఇదే తీరు ఆయన కొనసాగించి… మరింత పార్టీకి ఇమేజ్ తెస్తే.. టిడిపికి ప్లస్ అవుతారు.
** నివర్ తుఫాను బాధిత రైతులను పరామర్శించి సుబ్బయ్యా హత్య జరిగిన వెంటనే స్పాట్ కి వెళ్లి బాధితులను ధైర్యం చెప్పడం.. లోకేష్ లో కొత్త మార్పు కు ఇది సంకేతంగానే భావించవచ్చు. కష్టంలో ఉన్నప్పుడు కార్యకర్తలు భుజం తడితే అనే వారు పార్టీ కష్టంలో ఉన్నప్పుడు పార్టీ కి ప్లస్ అవుతారు. పార్టీ కోసం కష్ట పడతారు.. దీన్ని లోకేష్ సుబ్బయ్య హత్య విషయంలో వేగంగా స్పందించి…. టిడిపి కి.. కార్యకర్తలకు తాను ఎప్పటికి ముందు ఉంటానని చెప్పినట్లు అయింది. ఇప్పటికే లోకేష్ నాయకత్వం మీద బలమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన లో వస్తున్న ఈ కొత్త సంకేతాలు టిడిపికి మంచి రోజులు ఉన్నాయా లేవా అనేది భవిష్యత్తు నిర్ణయించాలి.

Related posts

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju