NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఎందెందు వెతికిన అందందు భూమే !! రాజకీయాలకు భూములకు లంకె

 

రాజకీయాలకు భూమికి చాలా దగ్గర సంబంధం… ఫెవికాల్ కన్నా విడదీయలేని బంధం… ప్రతి రాజకీయ నాయకుడు తన కెరీర్లో ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక భూమి వాదాన్ని పరిష్కరించడంలో ఇరుక్కోవడం సర్వసాధారణం… చాలామంది దీనిలో పీహెచ్డీ చేసి నైపుణ్యం సాధిస్తే మరికొందరు… పక్కా స్కేచ్ తయారుచేసుకుని భూములను మింగేస్తారు… అందుకే భూమిలోని మజా తెలుసుకునే రాజకీయ నాయకులు ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మారుతుంటారు… హైదరాబాదులోని హఫీజ్ పేట 50 ఎకరాల భూమి వివాదంలో కెసిఆర్ బంధువులను ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్ కిడ్నాప్ చేయించారని… ఇప్పటికీ ఆమెను అరెస్టు చేసిన నేపథ్యంలో రాజకీయాలకు రియల్ ఎస్టేట్కు మధ్య ఉన్న సంబంధం మరోసారి తెరపైకి వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ని రాజకీయాల్లో 76 శాతం మంది రిలీజ్ డేట్ చేసే వ్యాపారులు ఉన్నట్లు ఎన్నికల ముందు స్వచ్ఛంద సంస్థ సర్వేలో తేలింది.

అంతటా వారే!!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేగా గెలవగానే మొదట చేసే పని… తన నియోజకవర్గాల్లోని మండలాల్లోని తాసిల్దార్ లు, పోలీసులు తమకు అనుకూలమైన వారిని పోస్టింగులు ఇప్పించు కోవడం… ఏ ఎమ్మెల్యే అయినా మొదటి రెవిన్యూ, పోలీస్ తమ వారిని వేసుకున్న తర్వాతే మిగిలిన పనులు మొదలుపెడతారు.
** ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సంస్కృతి ఎక్కువ. అధికారంలో ఏపార్టీ ఉంటే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం అంతా తానే అయి వ్యవహరిస్తారు. మరో నాయకుడు తల దుర్చకుండా జాగ్రత్త పడుతారు.
** ప్రస్తుతం అధికార పార్టీలో 88 శాతం మంది ఎమ్మెల్యేలు భూ వ్యవహారాల్లో తలదూరుస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వద్ద సమాచారం ఉంది. దీనిలో కొందరు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతుంటే మరికొందరు అనుచరులు ద్వారా భూ వివాదాల చక్క పెడుతున్నారు.
** ప్రస్తుతం అధికార పార్టీలో 55 శాతం మంది రియల్ ఎస్టేట్ తో సంబంధం ఉన్నవారు. ప్రత్యక్షంగా గాని కుటుంబీకులు బంధువులు లేదా అనుచరుల ద్వారా వెంచర్లు వేయిస్తూ వ్యాపారం చేస్తున్నవారు ఉన్నారు.
** భూముల ధరలకు రెక్కలు వచ్చిన దగ్గర నుంచి హైద్రాబాద్ లో భూ వివాదాలు ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా వివాదాస్పద భూములను సెటిల్ చేసే గ్యాంగులు హైద్రాబాద్ లో సుమారు 200 వరకు ఉన్నట్లు పోలీసుల అంచనా.
** రాయలసీమ ముఠాలు.. ఫ్యాక్షన్ లో ఇన్వొల్వె అయినా కొందరి పేర్లు చెప్పుకుని జోరుగా దండాలు చేస్తున్నారు. కొందరు వ్యక్తుల పేర్లు చెబుతూ సైతం భూ వివాదాలు పరిస్కరిస్తున్నారు. వారి పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా కొందరు హల్చల్ చేస్తున్నారు.
** కొన్ని ప్రాంతాల్లో డైరెక్ట్ గ అధికారులే నాయకుల వద్దకు పంపుతున్నారు. రెవెన్యూ విషయాలు చూసేందుకు ఎమ్మెల్యే ల వద్ద ప్రత్యేక టీములు ఉన్నాయి. మొత్తం భూ వివాదాలు దగ్గరకు వస్తే అది ఎలాంటి లిటిగేషన్ భూమి .. ఎం చేస్తే చట్టపరంగా దక్కించుకోవచ్చు అన్న విషయాలను చెప్పేలా ఈ టీమ్ పని చేస్తుంది.
** ప్రభుత్వ జాగాలు.. ఎప్పటి నుంచో కొని వదిలేసినా ప్రైవేట్ స్థలాలు గుర్తించేందుకు నాయకుల ప్రోత్సహహం తో కొందరు బయటే చూసి.. దానికి సంబందించిన కాగితాలు పుట్టించి స్వాధీనం చేస్కోవడం కూడా సరికొత్త ఫాషన్. స్థలం కొన్న వారు గుర్తించేసరికి దాని మీద క్రయవిక్రయాలు అయిపోయిన సందర్భాలు అనేకం.

వివేకానంద హత్య కు ఇదే కారణమా?

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఓ రియల్ ఎస్టేట్ వివాదమే కారణమని సిబిఐ ప్రాథమికంగా నిర్ధారించింది. పలు కోణాల్లో కేసును విచారిస్తున్న సీబీఐ బెంగళూరుకు చెందిన ఓ భూవివాదంలో ఆయనకు శత్రువులకు వివాదం పెద్దది ఘర్షణకు దారి తీసిందని దాని వల్లనే ఆయన హత్య జరిగిందని సీబీఐ అంచనా వేస్తోంది. ఈ దిశగానే దర్యాప్తు చేపట్టిన సిబిఐ దానిలో కీలక ఆధారాలను సేకరించినట్లు సమాచారం.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?