NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఇరవై ఆరు కొత్త జిల్లాలు షురూ !శరవేగంగా సాగుతున్న ప్రక్రియ!!

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగం పుంజుకుంది. ఎన్నికలప్పుడు జగన్‌ చెప్పినట్టుగానే.. లోక్‌సభ నియోజకవర్గాలనే ప్రాతిపదికగా తీసుకుంది. ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ కూడా 26 జిల్లాలను ప్రతిపాదిస్తూ నివేదిక ఇచ్చింది.

అయితే అరకు లోక్‌సభ నియోజకవర్గంలో పాడేరు, పార్వతీపురం కేంద్రంగా రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని సూచించింది. అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 7 నియోజకవర్గాలను విభజించి 2 జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదించారు.పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాలను అరకు-1 పరిధిలోకి తీసుకొస్తారు. అరకువ్యాలీ, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలను అరకు-2 పరిధిలోకి తేవాలని సూచించారు. కొత్తగా ఏర్పాటయ్యే వాటిలో అరకు-1 జిల్లాకు పార్వతీపురం, అరకు-2 జిల్లాకు పాడేరు, హిందూపురం జిల్లాకు హిందూపురం లేదా పెనుకొండను జిల్లా కేంద్రాలుగా ప్రతిపాదించారు.

నమూనాగా ఆదిలాబాద్ జిల్లా!

కొత్త జిల్లాల ఏర్పాటులో విస్తీర్ణం, జనాభా, ఆదాయం, చారిత్రక అనుబంధాలు, భౌగోళిక కొనసాగింపు, మౌలిక సౌకర్యాలు, ఆర్థిక పురోగతి అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఈ సందర్భంగా తెలంగాణలో ఆదిలాబాద్‌ జిల్లా ఏర్పాటుకు అనుసరించిన విధానాలను ప్రస్తావించింది.
ఇవీ ప్రతిపాదిత కొత్త జిల్లాలు

అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. అరకు-1, అరకు-2, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, రాజమండ్రి, నర్సాపురం, అమలాపురం, కాకినాడ, ఏలూరు, ఒంగోలు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, నెల్లూరు, కడప, నంద్యాల, రాజంపేట, కర్నూలు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, హిందూపురం జిల్లాలు ఏర్పాటు అవుతాయి. కొత్త జిల్లాల్లో భాగంగా ఇప్పటి వరకు పిలుస్తున్న తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల పేర్లు మాయం కానున్నాయి.

38 కొత్త రెవెన్యూ డివిజన్లు!

కొత్త జిల్లాలు ఏర్పడుతుండడంతో రాష్ట్రంలోని 38 రెవెన్యూ డివిజన్లలో మార్పుచేర్పులు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. కొత్తగా 9 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతోపాటు, ప్రస్తుతమున్న వాటిలో మూడింటి రద్దుకు ప్రతిపాదించింది. ప్రతి జిల్లాలో 2 నుంచి 3 డివిజన్లు ఉండాలని కమిటీ సూచించింది. బాపట్ల జిల్లాలో కొత్తగా బాపట్ల, చీరాల రెవెన్యూ డివిజన్లను ప్రతిపాదిస్తూ నివేదిక ఇచ్చింది.గతంలోనే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి రాష్ట్రంలో కొత్తగా ఇరవై ఆరు జిల్లాలు ఏర్పడతాయని చెప్పారు.ఇక ప్రభుత్వం ఈ జాబితాకు ఆమోదముద్ర వేయడమే తరువాయి అని అధికార వర్గాలు అంటున్నాయి.జనవరి ఇరవై ఆరు నాటికి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ప్రక్రియ వేగంగా సాగుతోందని సమాచారం.

 

Related posts

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N