NewsOrbit
న్యూస్

అకుంఠిత దీక్షతో లక్ష్యసాధన! వండర్లు సృష్టిస్తున్న ట్రాన్స్ జెండర్లు!!

బ్బులిమ్మంటూ చికాకు పెట్టే సంఘటనలు. ట్రాన్స్ జెండర్ అనగానే 90% మందిలో ఇప్పటికీ అదే ఉద్దేశం. అయితే మానసికంగా, సొసైటీలో ఒక కనీస గుర్తింపు కోసం తపన పడ్డ ట్రాన్స్‌‌జెండర్స్ ఇప్పుడిప్పుడే నిలదొక్కు కుంటున్నారు.

పోలీస్, డాక్టర్ లాంటి ఉద్యోగాలే కాదు పాలిటిక్స్​లోకి కూడా ఎంటర్ అవుతున్నారు…‘కాంచన’ సినిమా ఒక ట్రాన్స్ జెండర్ అమ్మాయిని డాక్టర్ చేయాలనే కాన్సెప్ట్‌‌తోనే తయారయ్యింది. ఇప్పుడు ఆ సినిమా కథ నిజం అయ్యింది. అందుకు ఉదాహరణే ఈ ప్రియ!

డాక్టర్ ప్రియకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

మగ శరీరంలో ఆడపిల్లగా ఉండలేక పూర్తిగా ఆడపిల్లలలాగా మారిపోతే ఇంట్లో, బయటా అలాంటి వాళ్లని ఎలా చూస్తారో మనకు తెలియంది కాదు. అడుక్కోవటం, అందరికీ దూరంగా తనలాంటి వాళ్లతో కలిసి బతకటం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. కానీ ప్రియ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఆమె కుటుంబం పూర్తిగా ఆమె మనసుని అర్థం చేసుకుంది. ఆమె డాక్టర్ కావటానికి కావాల్సిన ఆత్మ విశ్వాసం ఇంటి నుంచే అందింది. “మా అమ్మానాన్న నాకు కావాల్సినంత ధైర్యం ఇచ్చారు. వాళ్లకి ఎప్పుడూ రుణపడి ఉంటాను” అని చెబుతోంది ట్రాన్స్‌‌జెండర్ డాక్టర్ ప్రియ.జిను శశిధరన్ అనే అబ్బాయిగా జన్మించిన ప్రియ తనలో ఉన్న అమ్మాయిల లక్షణాలని చిన్నప్పుడే గమనించింది.పూర్తిగా అమ్మాయిగా మారిపోవాలన్న తన కోరికను ఇంట్లో చెబితే ఎలా తీసుకుంటారోనని భయం ఉంది. కానీ ధైర్యం చేసి ఒకరోజు అమ్మానాన్నలకి విషయం చెప్పేశాను. నా తల్లిదండ్రులు చేసిన మొదటి పని నన్ను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకుపోవటం. అయితే అది మానసిక సమస్య కాదని నేను అమ్మాయిగానే ఉండాలనుకోవటం నా శరీరంలోనే ఉందని ఆయన చెప్పారు.స్కూల్‌‌లో ఉన్నంత వరకూ అసలు విషయం బయటికి తెలియనివ్వలేదు. కానీ ఆడపిల్లలా ఉండే నా ప్రవర్తనకి అబ్బాయిల నుంచి చాలా అవమానాలు ఎదుర్కొన్నాను. ఆ తర్వాత వేరే ప్రదేశానికి మారిపోవాలనుకున్నాను.

కానీ, నా ఫ్యామిలీ నాకు సపోర్ట్‌‌గా నిలబడింది.” అంటూ తన లైఫ్ జర్నీని చెప్పింది డాక్టర్ ప్రియ.అమ్మా నాన్న.. నన్నూ అన్నయ్యనీ డాక్టర్లు గా చూడాలనుకున్నారు. అన్నయ్య ఎంబీబీఎస్ పూర్తి చేసి బెంగళూరులో డాక్టర్‌‌‌‌గా పని చేస్తున్నాడు. నేను మెడికల్ కాలేజ్‌‌లోకి వెళ్లటానికి భయపడి టీచర్ అవ్వాలనుకున్నాను. కానీ నాన్న ధైర్యం చెప్పాక ఎంట్రన్స్ రాశాను.  2013 లో త్రిసూర్ దగ్గర ఒల్లూర్‌‌‌‌లోని “వైద్యరత్నం ఆయుర్వేద కాలేజ్”లో చేరాను.బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్​, మెడిసిన్ అండ్ సర్జన్​ పూర్తి చేశాను. అందరూ పెళ్లి గురించి అడుగుతుంటే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంగుళూర్ లో పీజీ  (ఎం.డీ) చేశాను. ఆ తర్వాత, త్రిపునితుర ప్రభుత్వ ఆయుర్వేదిక్​ మెడికల్ కాలేజ్, కన్నూర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో గెస్ట్ లెక్చరర్‌‌‌‌గా పని చేశాను. త్రిసూర్‌‌లోని సీతారాం ఆసుపత్రిలో చేరినప్పుడు హార్మోన్ ట్రీట్‌‌మెంట్ మొదలైంది. ఆ తర్వాత, నేను కొన్ని నెలల క్రితం నన్ను అమ్మాయిగా మార్చే ఆపరేషన్ చేయించుకున్నానని ప్రియ తెలిపింది

ఈ పోలీస్ ఆఫీసర్ కి సెల్యూట్ కొట్టాల్సిందే

తమిళనాడు, సేలం జిల్లాలో ఉండే  ట్రాన్స్‌‌జెండర్‌‌ ప్రీతికా యాశిని కూడా పోలీస్ అవడం కోసం చాలా కష్టపడింది.  ప్రదీప్ కుమార్ అనే అబ్బాయిగానే కంప్యూటర్ అప్లికేషన్స్​లో మాస్టర్ డిగ్రీ చేసిన అతను జెండర్ మార్చుకుని ప్రీతికా యాశినిగా మారిపోయింది అయితే, ఆపరేషన్‌‌కి ముందు  పోలీస్‌‌ ఎస్సై పరీక్షలకు అప్లై చేసింది. ఇందులో తనను తాను మూడో కేటగిరీ (ట్రాన్స్‌‌జెండర్) కింద నమోదు చేసుకుంది. దానివల్ల తమిళనాడు హోంశాఖ ప్రీతిక అప్లికేషన్ ని రిజెక్ట్ చేసింది. థర్డ్ జెండర్ కేటగిరీలో ట్రాన్స్ జెండర్  కోటా లేకపోవడంతో ఈ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యింది.  అయితే, ప్రీతిక ఏమాత్రం అధైర్యపడకుండా హైకోర్టును ఆశ్రయించింది. వీటిని పరిశీలించిన కోర్టు.. ప్రీతిక కేసుని స్పెషల్ కేస్‌‌గా తీసుకొని మరీ కట్‌‌ఆఫ్ మార్కులు 28.5 నుంచి 25కు తగ్గించింది. ఫిజికల్ ఫిట్‌‌నెస్‌‌లో మంచి మార్కులే ఉన్నాయి . అయితే, 100 మీటర్ల రన్నింగ్‌‌లో ఒకే ఒక్క సెకండ్‌‌తో వెనుకబడింది. అయినప్పటికీ.. కోర్టు ప్రీతికను ఎస్.ఐ ఉద్యోగానికి అర్హురాలిగా ప్రకటించింది. డాక్టర్ ప్రియ మాదిరే డాక్టర్ త్రినేత్ర కూడా ట్రాన్స్జెండర్లకు ప్రేరణగా నిలుస్తోంది.తన లైఫ్‌ ఆధారంగా ఓ డాక్యుమెంటరీ కూడా చేసింది. సోషల్ మీడియాలో ఈ ట్రాన్స్ ఉమన్ డాక్టర్‌‌కు వేల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.

 

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella