NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

ఇంతలో ఎంత మార్పు?సీన్ పూర్తిగా రివర్స్!తెలంగాణలో ఏం జరుగుతోంది??

టీఆర్ఎస్ లీడర్లకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు బీజేపీ బుగులు పట్టుకుంది. తమ అనుచరులు ఎప్పుడు ఎక్కడ బీజేపీలోకి జంప్​ అవుతారోనని కలవరపడుతున్నారు.

పార్టీ మారకుండా అనుచరులను, లోకల్​ లీడర్లను సముదాయించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కొందరిని బుజ్జగించి దారిలోకి తెచ్చుకుంటుంటే, మరికొందరికి తాయిలాలు ఇచ్చి మనసు మారుస్తున్నారు. గతంలో అపాయింట్​మెంట్  ఇవ్వని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా.. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత లోకల్​ లీడర్లకు ఫోన్లు చేసి మంచీచెడులు తెలుసుకుంటున్నారు. ‘‘తమ్మీ..! పార్టీ మారకుండ్రి. మీకు మేమున్నం. త్వరలోనే నామినేటెడ్ పదవులు వస్తయ్. అన్ని రకాలుగా మిమ్మల్ని మేం చూసుకుంటం” అని భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ బుజ్జగింపులకు తాత్కాలికంగా కొందరు ఓకే చెప్తున్నారు. అయితే.. అట్ల ఓకే చెప్పిన వాళ్లు కూడా సమయం చూసుకొని జంప్​ అయ్యే ప్రమాదం ఉందన్న భయం కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది.

ముఖ్యమంత్రి కుమార్తెకే ఝలక్

ఇటీవల నిజామాబాద్​ రూరల్​ జిల్లా ఎంపీటీసీలు, సర్పంచ్​లు మూకుమ్మడిగా బీజేపీలో చేరడం వారిని వెంటాడుతోంది.ఈ మధ్యే నిజాబామాద్ జిల్లా లోకల్ బాడీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకే స్థానిక టీఆర్ఎస్ ఎంపీటీసీలు, సర్పంచ్​లు ఝలక్​ ఇచ్చారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత జిల్లా టీఆర్​ఎస్​ పార్టీ వ్యవహారాలను కవిత పర్యవేక్షిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ లోని డిచ్ పల్లి ఎంపీపీ, వైస్ ఎంపీపీ, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్​లు మూకుమ్మడిగా టీఆర్​ఎస్​కు రాజీనామా చేశారు. వీరంతా ఢిల్లీకి వెళ్లి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ను కలిసి బీజేపీలో చేరడంతో కవిత షాక్​కు గురైనట్టు టీఆర్​ఎస్​ వర్గాలు అంటున్నాయి. ఈ వ్యవహారంపై ఆమె లోకల్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి ఫోన్ చేసి ఆరా తీసినట్లు తెలిసింది.

మంత్రులకూ మనశ్శాంతి లేదు!

మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు తమ్ముడు ప్రదీప్ రావు బీజేపీలో చేరేందుకు సిద్ధమైన్నట్టు వరంగల్​ జిల్లా రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తమ్ముడు టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్తే తన పరువు పోతుందన్న బెంగ మంత్రి ఎర్రబెల్లిలో కనిపిస్తోందని, తమ్ముడ్ని బుజ్జగించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని లోకల్​ లీడర్లు అంటున్నారు. అందుకే ఈ మధ్య ఎర్రబెల్లి మిగతా మంత్రుల కన్నా ఎక్కువగా బీజేపీపై విమర్శలు చేస్తున్నారని వరంగల్​కు చెందిన ఓ ఎమ్మెల్యే అన్నారు.కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ రమేశ్​ బీజేపీలో చేరడంతో మంత్రి గంగుల కమలాకర్​ అలర్ట్ అయ్యారు.  తన నియోజకవర్గం నుంచి పార్టీ మారే  ఆలోచనలో ఉన్న లీడర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. వారికి నచ్చచెప్తూ, టీఆర్ఎస్ లో ఉంటే లభించే రాజకీయ ప్రయోజనాలు వివరిస్తున్నారు.ఖమ్మం సిటీలో బీజేపీ బలం పుంజుకోవడం, ఇటీవల బీజేపీ నేతలు ఖమ్మంలో పర్యటించడంతో ఆ జిల్లా మంత్రి పువ్వాడ అజయ్​కి టెన్షన్ పట్టుకుందని లోకల్​ లీడర్లు చర్చించుకుంటున్నారు. గ్రేటర్ వరంగల్ లో

ఆ రెండు జిల్లాల్లో ఆందోళనకర పరిస్థితి!

త్వరలో వరంగల్, ఖమ్మం మున్సిపల్
కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రెండు మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి ఎక్కువగా టీఆర్​ఎస్​లోని అసంతృప్త నేతలు పార్టీ మారే చాన్స్ ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఈ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు…

 

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella