NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ , చంద్ర‌బాబు… సీట్లో ఎవ‌రున్నా వీళ్ల‌ను ఏం చేయ‌లేరు తెలుసా?!

chandrababu-given-48hours-time-to-jagan-government

రాజ‌కీయంగా ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ప్ర‌తిప‌క్ష నేత తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఎంత శ‌క్తివంతులో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఏపీలో ప్ర‌ధానంగా ఈ రెండు పార్టీల‌కు చెందిన నాయ‌కులే అధికం.

chandrababu-given-48hours-time-to-jagan-government

అలాంటి నాయ‌కులే స్వ‌యంగా కొన్ని విష‌యాల్లో లైట్ తీసుకుంటున్న ప‌రిస్థితి. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు, కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీసుల ఆదేశాలను కాదని ఈ ఏడాది కూడా పందెం రాయుళ్లు జోరుగా కోడిపందాలు నిర్వహించారు. దీంతో చ‌ట్టం , ఆదేశాల కంటే త‌మ సంతోషాలే ముఖ్యం అని స్ప‌ష్టం చేశారు ప‌లువురు పందెం రాయుల్లు .

సంక్రాంతి సంబురాల‌తో…

పల్లెల నుంచి పట్నాల వరకు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాల శోభ అంబరాన్ని అంటింది. ఈ మూడు రోజుల పండుగ‌లో భాగంగా వేకువ జామున చీకట్లను చీల్చుకుంటూ భోగి మంటల కాంతులు విరజిమ్మాయి. ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలతో తెలుగు ముంగిళ్లు ముస్తాబయ్యాయి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజు భోగి వేడుకలు భోగ భాగ్యాలకు నాందిగా నిలవాలని వేడుకున్నారు. మనసులోని చెడు దహించుకుపోవాలని కోరుకుంటూ భోగి మంటలు వేశారు. మంచిని కాంక్షిస్తూ మకర సంక్రాంతిని ఘనంగా చేసుకున్నారు. క‌నుమ రోజున‌ వాడవాడలా చిన్నాపెద్ద సందడి చేస్తున్నారు.

పంట సంబర‌మే కాదు… పందేలు కూడా…

ఆరు గాలం శ్రమించిన పంట చేతికొచ్చే వేళ సరికొత్త సంతోషాలు వ్యక్తమవుతూ పండుగ జ‌రుపుకోవ‌డ‌మే కాకుండా కోడి పందేలు కూడా అదే రీతిలో జ‌రిగాయి . గోదావరి జిల్లాల్లో అధికారుల ఆదేశాలకు భేఖాతరు చేస్తూ పందెం రాయుళ్లు కోడి పందేలు నిర్వ‌హించారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కోడిపందేలు జోరుగా జరుగుతున్నాయి. అమలాపురం రూరల్‌ మండలం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లో పోటాపోటీగా బెట్టింగులు నిర్వహించిన‌ట్లు స‌మాచారం. కాకినాడలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ రూరల్‌ గ్రామాలైన తిమ్మాపురం, చిడిగి, నేమాం, పండురూ, గుడారిగుంట, సర్పవరం గ్రామాల్లో కోడి పందాలు జ‌రిగాయ‌ని స‌మాచారం.

ఈ మూడు రోజులు అంతే….

ఎన్ని ఆంక్షలు ఉన్నా పండుగ మూడు రోజులూ ప‌లు చోట్ల‌ కోడి పందేలు నిర్వహిస్తున్నారు. కోడి పందేల శిబిరాలు వేసే స్థలాల వద్ద పోలీసులు నిఘా పెట్టినా ఫలితం లేకపోయింది. అయినప్పటికీ పందేలకు భారీగా శిబిరాలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నా పందెంరాయుళ్లు మాత్రం వెనుకంజ వేయలేదు. ఇటు అధికార పార్టీ అటు ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల ఒత్తిళ్ల‌తో పోలీసులు సైతం ప‌లుచోట్ల ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి ఎదురైంద‌ని స‌మాచారం.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju