ట్రెండింగ్ న్యూస్ ప్ర‌పంచం

గూగుల్ సంచలన నిర్ణయం..!రాజకీయ పార్టీలకు షాక్..!!

Share

గూగుల్ కంపెనీ సరికొత్త నిర్ణయం తీసుకుని రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చింది..! రాజకీయ పార్టీ ప్రకటనలు నిలిపివేసింది.. జనవరి 14 నుంచి ఇది అమలు లోకి వచ్చింది.. అమెరికాలోని క్యాపిటల్ భవనంపై దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.. ఈ నిషేధం జనవరి 21 వరకు అమలులో ఉంటుంది.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Political party ads banned Google takes a shocking decision

అమెరికాలోని క్యాపిటల్ భవనంపై దాడితో గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్న ఈ నిర్ణయం మొత్తంగా ఓ వారం రోజుల పాటు రాజకీయ ప్రకటనలకు అవకాశం లేదని చెప్పాలి. అమెరికా అధ్యక్షుడిగా బైడన్ ఈనెల 20వ తేదీన బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆలోచన చేయనుంది. ఆ తర్వాత గూగుల్ ల్ భవిష్యత్ కార్యాచరణ చేస్తుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం లో కూడా గూగుల్ రాజకీయ ప్రకటన విషయంలో పాక్షిక బ్యాన్ విధించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఫేస్ ఋక్ కూడా రాజకీయ ప్రకటనలు మీద ఇప్పటికే నిషేధం విధించింది. ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత మళ్ళీ ప్రకటనలకు అనుమతి ఇచ్చింది. గూగుల్, గూగుల్ అనుబంధ అన్ని విభాగాల్లోనూ ఎలాంటి రాజకీయ ప్రకటనలను తీసుకోదు.

 

అమెరికాలోని క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి తో ఇదొక సున్నితమైన అంశం కాబట్టి తాము ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని గూగుల్ తెలిపింది .అమెరికా అధ్యక్షుడు అభిశంసన , ప్రమాణ స్వీకారం, నిరసన లకు సంబంధించి ప్రకటన లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని గూగుల్ ఒక ప్రకటన లో తెలిపింది.

ఇది కూడా చదవండి : అంతరిక్షంలోకి సమోసా ను పంపిన భారతీయ రెస్టారెంటర్.. ఎక్కడ ల్యాండ్ అయిందో తెలుసుకోండిలా..


Share

Related posts

అఖిల్ సినిమా విషయంలో ఫస్ట్ టైం కరెక్ట్ డెసిషన్ తీసుకున్న మేకర్స్ ..!

GRK

విజయవాడ లోని స్ట్రాంగ్ లీడర్ కూతురు ని టార్గెట్ చేస్తోంది ఎవరు ?

sekhar

Munnar : మున్నార్ వెళ్తే ఈ ప్రదేశాలను తప్పకుండా చూడండి !! (పార్ట్2)

Kumar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar