Suma Kanakala: తెలుగు ప్రజలకి మరియు బుల్లితెర ప్రేక్షకులకు బాగా సుపరిచితమయిన పేరు సుమ కనకాల Suma Kanakala. మన రెండు రాష్ట్రాల సుమ కనకాల కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈమె సోషల్ మీడియా లో కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఆమె తన వాక్చాతుర్యంతో అలాగే ఉల్లాసంతో ఇంత మంది ప్రజల మన్నన పొందింది. సుమ స్టేజి మీదకు వస్తే చాలు ప్రేక్షకులు సంతోషపడిపోతారు.
ఏ పెద్ద ఈవెంట్ కానీ ఆడియో ఫంక్షన్ కానీ ఉంటె అక్కడ సుమ కచ్చితంగా ఉండాలనుకుంటారు నిర్వాహకులు. తన సెన్స్ అఫ్ హ్యూమర్ తో అందరిని నవ్విస్తు ఉంటుంది. సుమ తన కెరీర్ ఆరంభంలో సినిమాలతో చాలా బిజీగా ఉండేది. అప్పుడుడప్పుడు ఆమె కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది. అయితే సుమ సీరియల్స్ లో నటించే సమయంలో దిగిన ఫొటోషూట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంది. ఇటీవల సుమ తన పెళ్లికి ముందు సీరియల్స్ లో నటించే సమయంలో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా లో షేర్ చేసింది.
తన కెరీర్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు తనకి చాలా సినిమాలలో అవకాశాలు వచ్చాయట. కానీ విచిత్రం ఏమిటంటే తనకి ఎప్పుడూ ఒక హీారోయిన్ అవ్వాలని కానీ స్టార్ అయిపోవాలని కానీ ఆలోచన లేదట. అందుకే వెండితెర పై ఎన్ని మంచి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా తను కేవలం సీరియల్స్ మీదే ద్యాస పెట్టిందట.
నిజానికి 1996లో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో సుమ కనకాల హీరోయిన్గా కనిపించింది. కానీ ఇంక ఆ తర్వాత సీరియల్స్ అలాగే యాంకరింగ్ వైపు అడుగులు వేసింది. బుల్లితెర మీద గత కొన్ని సంవత్సరాలుగా సుమ కనకాల టాప్ యాంకర్‌గా కొనసాగుతున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!