NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

AP Police ; టార్గెట్ ఏపీ పోలీస్ – మేధస్సు మాటున అపకీర్తి..!!

AP Police ; Police Targeted by Politics

AP Police ; ప్రతిభ ఉన్న చోట అహం ఉంటే..? ప్రతిభ ఉన్న చోట ఒత్తిడి ఉంటే..!? ప్రతిభ ఉన్న చోట స్వేచ్ఛ లేకపోతే..!? ఏపీలో పోలీసుల తీరు ఇలాగే ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో పోలీసుల పనితీరుని వంకలు పెట్టలేం. కానీ.., ఖాకీలని ఖద్దరు శాసిస్తున్నప్పుడే ఏపీ పోలీసులకు మరకలు అంటుతున్నాయి. ఇప్పుడు అదే జరుగుతుంది. AP Police ఏపీ పోలీసులపై ఖద్దరు స్వారీ జరుగుతుంది..!

ఏపీలో పోలీసుల ప్రతిభకు కొదవ లేదు. సీఐడీ సాధించిన అవార్డులు.., పోలీసులకు వచ్చిన స్కాచ్ అవార్డులు.., ఏపీ పోలీసులకే ఎక్కువ. దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల్లోనూ పోలీసులకు ఇన్ని అవార్డులు లేవు. ఏపీ పోలీసుల మేథస్సు అటువంటిది. ఎంత కఠినమైన కేసునైనా సులువుగా ఛేదించి.., పరిష్కరించే సత్తా ఉంది. కానీ.. కొన్నేళ్లుగా పోలీసులపై మరకలు పడుతున్నాయి. పోలీసుల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి.

AP Police ; Police Targeted by Politics
AP Police ; Police Targeted by Politics

AP Police ; ఏపీ పోలీస్ నాడు – నేడు..!!

ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీకి అనుకూలంగా పోలీసులు, అధికారులు పని చేయడం సహజమే. ఇది ఎవ్వరూ కాదనలేరు. కాకపోతే గత టీడీపీ హయాం నుండి ఇది మరింత పీక్స్ కి చేరింది. ప్రతిపక్ష నేతలపై చీటికీ మాటికీ కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడం.. అధికార పార్టీ వాళ్లయితే వదిలేయడం ఎక్కువగా ఉంది. 2014 లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ పంథా ఎక్కువగా ఉంది. * 2015 లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుక వ్యవహారంలో తలదూర్చి తహసీల్దారు వనజాక్షిని కొట్టినంత పని చేశారు. ఆయనపై అనేక పిర్యాదులు అందినప్పటికీ ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ అయిదేళ్ల వ్యవధిలో చింతమనేనిపై అనేక వివాదాలు ఉన్నప్పటికీ అరెస్టు చేసిన దాఖలాలు ఏమి లేవు. * అప్పట్లోనే బోండా ఉమామహేశ్వరరావు.., బుచ్చయ్య చౌదరి, కూన రవికుమార్ వంటి నేతలు వ్యవహరించిన తీరు రాష్ట్రం మొత్తం చూసింది. కానీ వీరిపై పోలీసులు ఏనాడూ చర్యలు తీసుకోలేదు. అదే సమయంలో వైసీపీ నేతలపై ఎక్కువగా కేసులు పెట్టారు. సోషల్ మీడియా పోస్టింగులకు కూడా కేసులు పెట్టి అరెస్టులు చేశారు.

AP Police ; Police Targeted by Politics
AP Police ; Police Targeted by Politics

సో.. దానికి కొనసాగింపుగా జగన్..!!

టీడీపీ ఒకటి చేస్తే వైసీపీ రెండు చేస్తుంది. టీడీపీ యాభై చేస్తే.. వైసీపీ వంద చేస్తుంది..! అందుకే ఇప్పుడు పోలీసుల వ్యవహారశైలి మరింత మారింది. పోలీసులపై ఒత్తిళ్లు ఇంకాస్త ఎక్కువయ్యాయి. పోలీసులకు స్వేచ్ఛ కరువయింది. అడ్డగోలు కేసులు, అరెస్టులు ఎక్కువయ్యాయి. టీడీపీ ప్రవేశపెట్టిన పంథాని జగన్ మరింత పీక్స్ కి తీసుకెళ్లి కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులపై మరకలు ఎక్కువవుతున్నాయి..!!

* నిన్న అచ్చెన్నాయుడిని అరెస్టు చేసారు. వైసీపీ తరపున సర్పంచిగా పోటీ చేస్తున్న అభ్యర్థిని అచ్చెన్నాయుడు బెదిరించారనేది ఆరోపణ. ఇది భలే విడ్డూరమైన కేసు. అచ్చెన్నాయుడు ఏం మాట్లాడారో..? అప్పన్నతో ఎలా మాట్లాడారో..? చాల మంది వినే ఉంటారు. దీనిలో బెదిరింపులు ఏమి లేవు. ఇది కుటుంబ వ్యవహారమే. కాకపోతే అవకాశం దొరికింది.., ప్రతిపక్ష నేతపై కేసు పెట్టి, అరెస్టు చేసేద్దాం అనే ధోరణిలో ఇక్కడ వ్యవహారం సాగింది..!
* అంతకు ముందు టీడీపీ మహిళా విభాగం ఆధిక్యక్షురాలు అనితపై ఎస్సి , ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కూడా అటువంటిదే. ఆమె ఒక ఎస్సి.., ఆమెపై అట్రాసిటీ కేసుతో పోలీసుల తీరు నవ్వుపాలయింది. * పది రోజుల ముందు.. సీఎం జగన్ నివాసం వద్ద ఆందోళన చేయబోయిన వ్యక్తులపై అత్యాచారయత్నం కేసు నమోదు చేయడం విడ్డురమే..! * మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై నిర్భయ కేసు.. మాజీ హోమ్ మంత్రి చినరాజప్పపై అట్రాసిటీ కేసు కూడా అటువంటి కోవకే వస్తాయి. మధ్య మధ్యలో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై నమోదవుతున్న కేసుల్లో అయితే మరీ డొల్లతనం కనిపిస్తుంది. ఈ వ్యవహారం మొత్తంతో మసకబారుతున్నది ఖాకీల ప్రతిష్ట మాత్రమే..!!

 

 

Related posts

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?