NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Janasena : బ్రేకింగ్ : ఇదొక్కటీ జరిగితే బీజేపీ – జనసేన లోకి చిరంజీవి ?

Janasena : ఒక్కోసారి రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడే మాటలు, చేసే వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా, చర్చనీయాంశాలుగా మారుతుంటాయి. ఇప్పుడు ఆ వరుసలోకే మెగాస్టార్ megastar చిరంజీవి chiranjeevi పొలిటికల్ రీ ఎంట్రీ వ్యవహారం వచ్చింది. ఇటీవల జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ కు అండగా ఉంటాననీ మెగాస్టార్ చిరంజీవీ స్పష్టమైన హామీ ఇచ్చారని పేర్కొన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ తాను కలిసి ఉన్న సమయంలో పవన్ ను ఉద్దేశించి రెండు మూడు సంవత్సరాలు సినిమాలు చేసుకో ఆ తరువాత ఎప్పుడైనా నీ వెనుక అన్ని విధాలా అండగా ఉంటాను అని పవన్ చిరంజీవి చెప్పారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అయితే ఈ విషయం బయటకు రావడంతో చిరు జనసేన ద్వారా  పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వార్తలు గప్పుమన్నాయి. నాదెండ్ల మనోహర్ కు తోడు బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా జనసేన – బీజెపీలకు మద్దతు ఇస్తానని చిరంజీవి హామీ ఇచ్చారనీ చిరుతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధమని ప్రకటించారు.

Janasena : megastar chiranjeevi political re entry?
Janasena : megastar chiranjeevi political re entry?

త్వరలో జరగనున్న తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన – బీజెపీ ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి గెలుపే లక్ష్యంగా పని చేయాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో చిరు పొలిటికల్ రీఎంట్రీ వార్తలు రావడంతో జనసేన క్యాడర్ లో జోష్ నింపింది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తరువాత చిరంజీవి కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత పూర్తిగా సినీ రంగానికే పరిమితం అయి రాజకీయాలకు పూర్తిగా  దూరంగా ఉంటున్నారు. ఓ పక్క రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలను, సీఎం వైఎస్ జగన్ వైఖరిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే చిరు..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు. అసలే రాజకీయాలంటే చిరు తీవ్ర విరక్తిగా ఉన్నట్లు సమాచారం. అందుకే తమిళనాట రాజకీయ పార్టీ పెట్టాలని భావిస్తున్న తరుణంలో రజనీకాంత్  కు రాజకీయ పార్టీ వద్దంటూ సలహా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అందరికీ రాజకీయాలు అచ్చిరావనీ, మన లాంటి వాళ్లు రాజకీయాల్లో రాణించడం కష్టమని, ప్రజల్లో అభిమానం ఉండటం వల్ల రాజకీయం చేయడం వేరని రజనీకి చెప్పినట్లు సమాచారం. చిరు మాటలు అంతగా పట్టించుకోని తలైవా రాజకీయ పార్టీకి పెట్టడానికి సిద్ధమైనా తరువాత అనారోగ్య కారణంతో ఆ ప్రతిపాదన విరమించుకున్న విషయం  తెలిసిందే. ఈ విషయాలను పక్కన పెడితే ప్రస్తుత పరిస్థితుల్లో చిరు పొలిటికల్ రీ ఎంట్రీ అనేది పుకారేనని అనుకుంటున్నారు. దీనిపై చిరు మాత్రం ఇంత వరకూ స్పందించలేదు.  రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి జనసేన – బీజెపీ నేతల కోరిక,  అభిమానుల ఆకాంక్షపై చిరు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

 

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella