NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

pawan kalyan : గెలవకపోతే పోరాడరా పవన్??

pawan kalyan : వచ్చింది అవకాశం అన్నట్లుగా… చెప్పిందే వేదం అన్నట్లుగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు గాని విశాఖ ఉక్కు ఉద్యమం లో, జరుగుతున్న అన్యాయం విషయంలో ఎక్కువగా ఊహించుకోవడం వల్ల వచ్చే లాభం కన్నా నష్టం ఎక్కువ అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి.. జనసేన పార్టీ నాయకత్వం గానీ విశాఖపట్నం జనసేన పార్టీ కార్యకర్తల గాని కొత్తగా ఇప్పుడు ఎత్తుకుంటున్నారు రాగం ఏంటంటే విశాఖపట్నం జిల్లా గాజువాక లో పవన్ ను ఓడించడం వల్లే ఇప్పుడు కనీసం విశాఖ ఉక్కు మణిహారంగా వుండే ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం అవుతున్న కనీసం పోరాడే నాయకుడు లేడు అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం ఊదరగొడుతున్నారు. దీనిలో వారు ఏం చెప్పదలచుకున్నా రు ఎవరికి చెప్పదలుచుకున్నాను అనే విషయాన్ని పక్కన పెడితే ఇలాంటి ప్రచారాలు వల్ల జనసేన పార్టీ రాజకీయ పరిపక్వత అర్థమవుతుంది. ఆ పార్టీ కార్యకర్తలు ఎలా ఆలోచిస్తారు అన్న తీరు అర్థమవుతుంది.

pawan kalyan if won't win you did not protect pawa?
pawan kalyan if won’t win you did not protect pawa?

pawan kalyan : మీ నాయకుడు చెప్పిందే గా!

ప్రజలు ఓడించినా గెలిపించిన ప్రజల తరఫున కష్టం వచ్చినప్పుడు ప్రశ్నిస్తాం అని పోరాడుతానని పవన్కళ్యాణ్ పదేపదే చెబుతారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గాజువాకలో ఓడితే రాష్ట్రం మొత్తానికి కీలకమైన ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తే పోరాడ రా?? కేవలం గాజువాక ప్రజలు గెలిపిస్తేనే అక్కడి సమస్య మీద పోరాడుతార?? పవన్ కళ్యాణ్ గాజువాక కు చెందిన నాయకుడు అన్న లేక రాష్ట్ర నాయకుడ?? విశాఖ ఉక్కు సమస్య అనేది కేవలం విశాఖకు సంబంధించిన సమస్య లేక రాష్ట్ర సమస్య?? ఇవన్నీ విజ్ఞతతో ఆలోచిస్తే సమాధానం దొరికే అంశాలు. ఊరికే ప్రతిసారి గాజువాక ప్రజలు ఓడించారు విశాఖ సమస్యలను పట్టించుకోని అన్నట్లు మాట్లాడితే జనసేన పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్ర స్థాయి నాయకుడు అన్నది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఓడించిన ప్రజలకు అండగా నిలవాలి. గాజువాక లో సైతం పవన్ కళ్యాణ్ కు సుమారు 60 వేల కోట్లు పైగా వచ్చాయి. మరి అలాంటప్పుడు ముందుండి పోరాడాల్సిన నాయకత్వం సైతం పవన్ కళ్యాణ్ తీసుకోవాలి. అంతేగాని గాజువాక ప్రజలు ఓడించారు కదా ఉద్యమంలో మేము పాల్గొనం అంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇలాంటి చిల్లర ప్రచారం వల్ల జనసేన పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదు అని ఆ పార్టీ కార్యకర్తలు గుర్తించుకోవాలి.

ఏమని అడుగుతారు?

ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో జనసేన పార్టీ ఎట్టకేలకు స్పందించింది. రాష్ట్రంలో మిగిలిన పార్టీలతో పోలిస్తే జనసేన పార్టీ స్పందన బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బీజేపీ మిత్రపక్షంగా రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్న జనసేన పార్టీ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో ఈ విషయాన్ని మాట్లాడతానని శుక్రవారం సాయంత్రం ప్రెస్ నోట్ విడుదల చేశారు. దీనిపై ఖచ్చితంగా కేంద్ర పెద్దలతో చర్చించే ప్రైవేటీకరణ అడ్డుకుంటామని ఆ దిశగా ఉద్యమం చేస్తామని జనసేన పార్టీ చెప్పడాన్ని స్వాగతం చవచ్చు. ఇదే తరహా వాయిస్ను కనీసం ఇతర పార్టీలు ఇవ్వక పోవడం విచారకరం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను సైతం విజయసాయిరెడ్డి పేరుమీద తో చేయడానికి టిడిపి నాయకుడు లోకేష్ బాబు శుక్రవారం మాట్లాడిన మాటలు టిడిపి తీరును తెలియజేస్తున్నాయి. కేవలం రాష్ట్ర నాయకులు మీదే తోసేయడానికే టీడీపీ చూస్తోంది తప్ప కనీసం ఢిల్లీ వెళ్లి బిజెపి నాయకులతో మాట్లాడతానన్న కనీస ప్రెస్ నోట్ కూడా టిడిపి నుంచి కరువైంది. మోడీ విషయంలో చంద్రబాబు ఏ మేరకు భయపడుతున్నారు అనేది ఈ విషయంలో మరోసారి స్పష్టమైంది. ఇక అధికార పార్టీ కూడా అదే తీరు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మీద వైఎస్ఆర్సిపి రాజకీయ కారణం ఏమిటన్నది ఆ పార్టీ నాయకులు ఎవరూ శుక్రవారం మాట్లాడలేదు. దీనిపై ఎలాంటి వ్యూహం పడుతుంది అనేది త్వరలో తెలుస్తుంది. అయితే ముఖ్యంగా కొత్త రాజకీయాలు ప్రతి విషయంలో ప్రయత్నిస్తామని చెబుతూ వచ్చిన జనసేన పార్టీ మాత్రం గాజువాక ను సాకుగా చూపి విశాఖ ఉద్యమం నుంచి తప్పకుందం అనుకుంటే మాత్రం అది ఎప్పటికీ చరిత్రలో మాయని మచ్చ గానే మిగిలిపోతుంది. ముందుగా ఆ ప్రచారాన్ని ఆపి విశాఖ ఉక్కు ఉద్యమం లో ఆ పార్టీ తీరు ఎలా ముందుకెళ్లాలనే దానిమీద ఆలోచిస్తే మేలు.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?