NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan Mohan Reddy : పక్కాగా ఇది జగన్ బాణమే అంటున్నారు..??

Ys Jagan Mohan Reddy : జగన్ అన్న వదిలిన బాణాన్ని అంటూ అప్పట్లో వైయస్ షర్మిల దేశంలో ఏ మహిళా చేయని విధంగా దాదాపు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం అందరికీ తెలిసిందే. జగన్ జైల్లో ఉన్న సమయంలో పార్టీ నిలబెట్టడంలో మాత్రమే కాక పార్టీ చెక్కుచెదరకుండా మహిళా అయినాగాని రాజకీయ అనుభవం లేకపోయినా గాని ముందుండి నడిపించడం జరిగింది. అంతమాత్రమే కాకుండా పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన ఉప ఎన్నికలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కీలకంగా షర్మిల రాణించడం జరిగింది. ఆ తర్వాత జగన్ ముఖ్యమంత్రి అవడం కోసం 2019 ఎన్నికల ప్రచారంలో కీలకంగా రాణించి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా వరకు ఇంటికే పరిమితం అయింది.

Sharmila party behind plan ys jagan
Sharmila party behind plan ys jagan

 

Ys Jagan Mohan Reddy : జగన్ ప్లాన్ ప్రకారం :-

ఇలాంటి తరుణంలో తాజాగా హఠాత్తుగా తెలంగాణలో పార్టీ పెట్టడానికి షర్మిల ముందుకు రావడానికి గల కారణం జగనే అన్న వాదన తెలుగు రాజకీయాల్లో వినిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకురావడానికి తాను కృషి చేస్తున్నట్లు కిందిస్థాయి కార్యకర్తల తో మంతనాలు జరిపి భవిష్యత్తు ప్రకటనకు రెడీ అవుతున్నట్లు షర్మిల మీడియా కి తెలపడం అందరికీ తెలిసిందే. ఇంత హఠాత్తుగా షర్మిల అదీ తెలంగాణలో పార్టీ పెట్టడం అనేది జగన్ యొక్క స్ట్రాటజీ అనే టాక్ వస్తుంది. పూర్తి విషయంలోకి వెళ్తే తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ క్రమేణా తగ్గుతూ ఉన్న క్రమంలో.. ఆ పార్టీకి చెందిన నాయకులు మరియు ఓటు బ్యాంకు బీజేపీ వైపు మళ్ళుతుంది తరుణంలో జగన్ ముందుజాగ్రత్త తీసుకున్నట్లు, అందువల్ల జగన్ వెనకుండి షర్మిల ని రంగంలోకి దింపుతున్న ట్లు విశ్లేషణలు వస్తున్నాయి.

 ఓటు వేరే వైపు వెళ్లకుండా:-

టిఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ మాత్రమే కాక కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కూడా గల్లంతు అవుతున్న తరుణంలో .. బిజెపి వైపు వెళ్లే అవకాశాలు మెండుగా ఉండటంతో ఏమాత్రం తెలంగాణలో బిజెపి వచ్చిన రెండు తెలుగు రాష్ట్రాల్లో గొడవలు జరిగే అవకాశం ఉందని.. విభజన చట్టంలో ప్రకారం సరైన పంపకాలు లేని తరుణంలో అది మొత్తానికి తన భవిష్యత్తు కి పెద్ద డ్యామేజ్ చేసే అవకాశం ఉండటంతో షర్మిల చేత జగన్ ఏ పార్టీ పెట్టించి .. కాంగ్రెస్ ఓటుబ్యాంకు అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు కమలం పార్టీ వైపు వెళ్లకుండా సరికొత్త ఎత్తుగడ వేసినట్లు, మళ్లీ బాణాన్ని తెలంగాణ రాజకీయాల్లో వదిలినట్లు సీనియర్లు చెప్పుకొస్తున్నారు.

Related posts

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?