NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Governor : గ‌వ‌ర్న‌ర్ మేడం ఎంట్రీ ఇచ్చారు… న్యాయ‌వాది హ‌త్య ఎపిసోడ్‌లో కీల‌క ప‌రిణామం

trs commends telangana governor comments on ts govt over corona virus

Governor : తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా కలకలం సృష్టించిన హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య ఉదంతంలో ప‌రిణామాలు మారుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. కొన్ని విషయాలను రాబట్టారు. అయితే, ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. వామన్‌రావు దంపతుల హత్యపై విచారణ వేగవంతం చేయాలని లేఖలో ప్రభుత్వానికి ఆమె కోరారు.

trs commends telangana governor comments on ts govt over corona virus

Governor గ‌వ‌ర్న‌ర్ మేడం ఏమంటున్నారంటే…

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై గవర్నర్ సమీక్షించారు.. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆమె.. పుదుచ్చేరి రాజ్ నివాస్ నుండి హైదరాబాద్ లోని రాజ్ భవన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మంథనిలో జరిగిన న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నేప‌థ్యంలో త్వ‌రిత‌గ‌తిన విచార‌ణ కోసం చొర‌వ తీసుకోవాల‌ని లేఖ రాశారు. వామ‌న్‌రావు కేసులో దోషులకు శిక్ష పడేలా చూడాలని.. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని లేఖలో పేర్కొన్నారు.

సంచ‌ల‌న విష‌యాలు …

వామన్‌రావు దంపతుల హత్య కేసులో ఇప్పటికే సంచలన నిజాలు బయటికి వస్తున్నాయి. ముగ్గురు నిందితులను పోలీసు కస్టడీకి అప్పగించాలంటూ మంథని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిష‌న్ ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన మంథని కోర్టు.. ముగ్గురు నిందితులను పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది.. ఏడు రోజుల పాటు నిందితుల విచారణకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడంతో.. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతున్నారు..

మైండ్ పోయే నిజాలు…

4 నెలల క్రితమే వామన్‌రావును హతమార్చేందుకు యత్నించినట్లు నిర్ధారణ అయింది. బిట్టు శ్రీనును అరెస్ట్‌ చేసిన పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. గుంజపడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీనుతో బిట్టు శ్రీనుకు ఆరేళ్ల క్రితం స్నేహం ఏర్పడింది. ఇద్దరూ మద్యం తాగే సమయంలో వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుకునే వారు. ఈ క్రమంలోనే వామనరావు దంపతుల గురించి చర్చకు వచ్చింది.

గ్రామంలో తన ఆధిపత్యానికి అడ్డు వస్తున్నట్లు భావించిన కుంట శ్రీను.. బిట్టు శ్రీనుతో కలిసి హత్యకు ప్రణాళిక రచించాడు. నాలుగు నెలల క్రితమే.. గుంజపడుగు వచ్చిన వామన్‌రావును హత్య చేసేందుకు కుంట శ్రీను యత్నించాడు. కానీ, ప్లాన్ స‌క్సెస్‌ కాలేదు.. అతడిని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డు తొలగించుకుంటే కాని తమకు భవిష్యత్తు ఉండందని అనుకుని..

ఒకేసారి ఆ న్యాయవాద దంపతులను దారుణంగా హత్య చేశారు. ఇక, దంపతుల హత్య కేసులో ముందుగా కుంట శ్రీను, చిరంజీవిలతో పాటు కుమార్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. వారిచ్చిన సమాచారం ఆధారంగా బిట్టు శ్రీనుని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని పోలీసు అధికారులు తెలిపారు. ఘటన జరిగిన తర్వాత బిట్టు శ్రీను ఎవరెవరితో మాట్లాడాడో డేటా సేకరించారు. రిమాండ్‌లో ఉన్న నిందితుల ఫోన్‌ డేటాపై కూడా దృష్టి పెట్టారు.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N