NewsOrbit
ట్రెండింగ్ రాజ‌కీయాలు

Suicide : బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు కారణం ఎవరు…?

Suicide :  హైదరాబాద్ ఘట కేసర్ కు చెందిన బీఫార్మసీ విద్యార్థిని కొద్దిరోజుల ముందు తాను కిడ్నాప్, రేప్ కు గురి అయినట్లు పోలీసులు ముందు డ్రామా ఆడిన విషయం తెలిసిందే. తనపై అఘాయిత్యానికి జరిగిందని ముందుకు వస్తే పోలీసులు ఆమె చెప్పిన ముద్దాయిలను అరెస్టు చేశారు. అయితే వారిని అరెస్ట్ చేసిన రెండు రోజుల తర్వాత విద్యార్థిని చెప్పినట్లు ఎటువంటి కిడ్నాప్ గాని రేపు గాని జరగలేదని ప్రెస్ మీట్ పెట్టి మరీ పోలీసులు పేర్కొన్నారు. అదే విషయాన్ని పిటిషన్ లో పొందుపరిచారు.

 

who is responsible for b pharm student Suicide
who is responsible for b pharm student Suicide

నిజంగానే ఆ విద్యార్థినిపై ఆటోడ్రైవర్లు అఘాయిత్యానికి పాల్పడ్డ లేదు. ఆమె స్నేహితులతో వెళ్లి డ్రగ్స్ తీసుకొని ఇంట్లో ఏం చెప్పాలో తెలీక అలా నాటకం ఆడింది అని పోలీసులు అసలు గుట్టుని బట్టబయలు చేశారు. అయితే ఆ బీఫార్మసీ విద్యార్థిని ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ కేసులో పోలీసులకు వ్యతిరేకంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు చెప్పాల్సిన తీర్పుని పోలీసుల ప్రెస్ మీట్ పెట్టి చెప్పారని పిటిషన్లో అడ్వకేట్ అరుణ్ కుమార్ పేర్కొన్నారు.

కిడ్నాప్ కేసులో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించి ప్రెస్ మీట్ పెట్టడం వల్లనే ఆ విద్యార్థిని మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. కాబట్టి పోలీసు వారిపై చర్యలు తీసుకుని విద్యార్థిని కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని అరుణ్ కుమార్ కోరారు. పోలీసుల తొందరపడి చేసిన చర్యల వల్లే ఒక విద్యార్థిని జీవించే హక్కు కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి కిడ్నాప్ డ్రామా తో హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని కథ విషాదాంతం అయింది.

ఈ కేసులో తీవ్ర విమర్శలు ఎదుర్కున్న యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసులో అసలు విషయం బయటకు చెప్పడంతో సోషల్ మీడియాలో ఆమె పై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. అది భరించలేక షుగర్ టాబ్లెట్ లు వేసుకొని ఆమె ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు. అయితే ముందు విద్యార్థిని ఆటో డ్రైవర్ల పేర్లు చెప్పినప్పుడు మీడియా వారు విపరీతంగా హైలైట్ చేశారు. అలాంటి వారిని ఎన్ కౌంటర్ చేయాలి అని ఏకి పారేశారు. అయితే అసలు విషయం బయటకు వచ్చి ఇదంతా అమ్మాయి ఆడిన డ్రామా అని తెలిసిన తర్వాత మళ్ళీ అమ్మాయి కి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేశారు. దీంతో సోషల్ మీడియాలో మరికొంతమంది డిజిటల్ మీడియా వారు కూడా ఆమె చావుకు బాధ్యులు అని చెబుతుండడం గమనార్హం.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju