Krithi sanon : కృతి సనన్ ప్రభాస్ ఆదిపురుష్ లో సీత గా నటిస్తుందా అవుననే మాట ముంబై మీడియాలో గట్టిగానే వినిపిస్తోంది. బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆదిపురుష్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి గా రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరికి సంబంధించిన పోస్టర్స్ కూడా రిలీజయ్యాయి. ఈ క్రమంలో ఆదిపురుష్ ప్రకటించినప్పటి నుంచి రాముడిగా నటిస్తున్న ప్రభాస్ కి జంటగా నటించే సీత పాత్రలో ఏ హీరోయిన్ కనిపించబోతుందన్న విషయంలో మేకర్స్ సీక్రెట్ మేయింటైన్ చేస్తున్నారు.
ఇప్పటికే పలువురు పేర్లు సోషల్ మీడియాలో బాగా ప్రచారం అయ్యాయి. కాని ఫైనల్ గా మాత్రం బాలీవుడ్ సినిమాలతో యమా బిజీగా ఉన్న కృతి సనన్ పేరు బాగా వినిపిస్తోంది. తెలుగులో కూడా కృతి సనన్ మహేష్ బాబు తో 1 నేనొక్కడినే అన్న సినిమా చేసింది. అలాగే నాగ చైతన్య తో దోచేయ్ అన్న సినిమా చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరసగా నాలుగు సినిమాలు చేస్తుండగా 5 వ ప్రాజెక్ట్ గా ప్రభాస్ ఆదిపురుష్ ఉందని సమాచారం.
Krithi sanon : కృతి సనన్ ఆదిపురుష్ లో సీత అని చెప్పుకుంటున్నారు.
మొత్తం కృతి సనన్ 5 సినిమాలు చేతిలో ఉన్నాయని అర్థమవుతోంది. అంటే ఖచ్చితంగా ఆదిపురుష్ లో సీత కృతి సనన్ అని చెప్పుకుంటున్నారు. త్వరలో అధికారకంగా ప్రకటన ఇవ్వనున్నారని అంటున్నారు. ఇక సీత పాత్ర తో పాటు లక్ష్మణుడు, భరత శత్రుజ్ఞుల పాత్రలు ఉండగా ఆ పాత్రలో నటింప చేసేందుకు దర్శకుడు పలువురు పేర్లు పరిశీలిస్తున్నాడట. ఇక తాజా సమాచారం ప్రకారం లక్ష్మణుడి పాత్రకి బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ ని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆదిపురుష్ షూటింగ్ ముంబై లో శరవేగంగా సాగుతోంది.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!