NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ

Tirupati : తిరుపతి తీరే వేరయా! 19 ఏళ్ల తర్వాత ఎన్నికలు!

Tirupati : దాదాపు 19 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఆధ్యాత్మిక నగరి తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు రసవత్తరంగా కనిపిస్తున్నాయి. 2007లో నగరపాలక సంస్థ గా మారిన తర్వాత నుంచి ఎన్నికలు ఇక్కడ జరగలేదు. తొలి మేయర్ పీఠం కోసం ఇప్పుడు ఆసక్తికర పోటీ నెలకొంది. అధికార పార్టీకే దక్కే అవకాశం ఉన్న మేయర్ పీఠం ఎవరికి దక్కాలి అనే దాని మీద స్పష్టత లేదు.

Tirupati
Tirupati

 Tirupati ఎన్నో తలనొప్పులు!

2002లో మున్సిపాలిటీ గా ఉన్నప్పుడు తిరుపతికి చివరి సారి ఎన్నికలు జరిగాయి. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని మున్సిపల్ చైర్మన్గా శంకర్ రెడ్డిని నియమించారు. ఆయన తర్వాత 2007లో వైస్సార్ హయాంలో తిరుపతిని కార్పొరేషన్గా అప్ గ్రేడ్ చేశారు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని భావించినా కొన్ని కోర్టు కేసులతో ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ప్రత్యేకాధికారుల పాలన లోనే కొనసాగింది. ప్రతిసారీ ఏదో ఒక విషయం మీద కోర్టు కేసులు పెండింగ్లో ఉండటంతో మొదటిసారి కార్పొరేషన్ ఎన్నికలు జరగడానికి 19 ఏళ్ళు పట్టింది. తాజాగా కోర్టులో ఉన్న కేసులన్నింటినీ ఒకేసారి హైకోర్టు పరిష్కరించడంతో ఎన్నికలు జరిగేందుకు మార్గం సుగమం అయ్యింది.

సయోధ్య సరిపోతుందా??

తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ రెడ్డి నాలుగో డివిజన్ కార్పొరేటర్ గా ఏకగ్రీవం అయ్యారు. బీసీ మహిళలకు రిజర్వేషన్ అయిన మేయర్ పీఠం మీద తిరుపతిలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న యాదవులకు మేయర్ పీఠం ఇవ్వాలని కరుణాకర్ రెడ్డి భావించారు. ఈ పీఠానికి టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన అన్న రామచంద్రయ్య కూతురు అనిత తో పాటు మొదటినుంచి వైకాపాకు వెన్నుదన్నుగా నిలుస్తున్న జల్లి తులసి యాదవ్ వదిన శిరీష పేరు వినిపిస్తోంది. అయితే 2019 ఎన్నికల ముందే పార్టీలోకి వచ్చిన అన్నా రామచంద్రయ్య కుటుంబానికి మేయర్ పీఠం ఇస్తే పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి ప్రాధాన్యం దక్కదని భూమన భావిస్తున్నారు. దీంతోపాటు తిరుపతి నగరంలో అన్నా రామచంద్రయ్య మీద ప్రజల్లో ఉన్న ప్రతికూలత పార్టీ పై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.

దీంతో యాదవ సామాజిక వర్గం నుంచి జల్లి శిరీషను మేయర్ చేసేందుకు ఇటీవల భూమన కరుణాకర్రెడ్డి ఇరు వర్గాలతో మాట్లాడారు. ఇప్పటికే 27వ డివిజన్ నుంచి ఏకగ్రీవం అయిన శిరీషను మేయర్ గా అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రతిపాదించడంతో అన్నా రామచంద్రయ్య సైతం అడ్డు చెప్పలేకపోయారు. నగరంలో వైష్ణవి హాస్పిటల్ ద్వారా అందరికి సుపరిచితురాలైన డాక్టర్ శిరీష ను మొదటి రెండున్నర సంవత్సరాలు మేయర్ పీఠం ఇచ్చేలా ఒప్పందం కురిరింది. మరో నామినేటెడ్ పోస్టు ద్వారా అన్న రామచంద్రయ్యకు అవకాశం వచ్చినప్పుడు ఇచ్చేందుకు సైతం భూమన సయోధ్య కుదిరిచ్చినట్లు తెలిసింది.

ఎమ్మెల్యే కొడుకే ఉప మేయర్

నాలుగోవ డివిజన్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ రెడ్డి డిప్యూటీ మేయర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యక్ష రాజకీయాల్లో లేని అభినాయ్ ను తన రాజకీయ వారసుడిగా భూమన్న వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో అభినయ్ ను ఉప మేయర్ చేయడం ద్వారా రాజకీయ ప్రవేశం కింది స్థాయి నుంచి చేయించినట్లు అవుతుందని, రాజకీయ పాఠాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని భూమన భావిస్తున్నారు. దీంతో తిరుపతి ఒక మేయర్గా భూమన అభినయ్ దాదాపు ఖరారు అయినట్లే.

వారి నుంచే అసలైన పోటీ

తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ కి స్వతంత్ర అభ్యర్థులు బలం గా పోటీ ఇస్తున్నారు. టిడిపి అభ్యర్థులు ఇరవై మూడు డివిజన్లలో పోటీ ఉండగా, స్వతంత్ర అభ్యర్థులు 23 డివిజన్లలో పోటీలో నిలిచారు. బీజేపీ తరఫున ఎనిమిది మంది, సిపిఐ నుంచి ఇద్దరు, జనసేన నుంచి ఇద్దరు, సిపిఎం నుంచి నలుగురు బరిలో ఉన్నారు. అయితే అధికార పార్టీ కు టిడిపి నుంచి పెద్దగా పోటీ కనిపించడం లేదు.

పోటీలో ఉన్న డివిజన్లలో సైతం ప్రచారం అంతంతమాత్రంగానే సాగుతోంది. అయితే 33 డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సత్యవతి, 28 వ డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న భువన్ కుమార్ రెడ్డి లతో పాటు మరికొన్ని డివిజన్లలో అధికారపార్టీకి స్వతంత్రులు బలమైన పోటీ ఇస్తున్నారు. ఇక టీడీపీ తరపున పెద్ద నాయకులు కనీసం తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో పాల్గొనక పోవడం విశేషం. ఎట్టకేలకు జరుగుతున్న తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఈ సారి అధికార పార్టీ హవా స్పష్టంగా కనిపించనుంది.

Related posts

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?