NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Municipal Elections : మున్సిపోల్ లో అక్కడక్కడా టీడీపీ – జనసేన దోస్తీ..!? అధినేతలు చూస్తున్నారా..?

Municipal Elections : రాష్ట్ర స్థాయిలో టీడీపీ – జనసేన దోస్తాన్ కటీఫ్ అయినా మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఆయా పార్టీల నేతలు ఓ అవగాహనతో ముందుకు సాగుతున్నారు. ఇది బీజెపీకి రుచించడం లేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజెపీ కూటమికి మద్దతు ఇచ్చిన జనసేన 2019 ఎన్నికల్లో ఒంటరి పోరు చేసి చావు దెబ్బతిన సంగతి తెలిసిందే. ఆ తరువాత జనసేన, బీజెపీ రాష్ట్ర స్థాయిలో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్నాయి. అయితే క్షేత్ర స్థాయిలో బీజెపీకి పెద్దగా బలం లేకపోవడంతో పలు గ్రామాల్లోని పంచాయతీ ఎన్నికల్లో టీడీపీతో జనసేన లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే ఫందాతో ముందుకు సాగుతోంది. నరసాపురం, జంగారెడ్డిగూడెం, మున్సిపాలిటీ ఎన్నికల్లో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని ఎన్నికల ప్రచారాలను నిర్వహిస్తున్నాయి. టీడీపీ, బీజెపీ అపవిత్ర పొత్తు అంటూ వైసీపీ విమర్శలు చేస్తున్నది. బీజెపీని కాదని జనసేన టీడీపీతో జత కట్టడాన్ని ఉమ్మడి ప్రచారం నిర్వహించడంపైనా వైసీపీ ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నది. ఏలూరులో టీడీపీ అభ్యర్థులు లేని చోట్ల జనసేన అభ్యర్థులకు ప్రచారం చేస్తానని కూడా టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Municipal Elections : tdp -janasena coalition
Municipal Elections : tdp -janasena coalition

నరసాపురం మునిసిపాలిటీల మొత్తం 31 వార్డులు ఉండగా వాటిలో మూడు వార్డులు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. వీటిలో 19 వార్డుల్లోనే టీడీపీ పోటీ చేస్తుండగా, జనసేన ఏడు వార్డుల్లో పోటీ చేస్తున్నది. టీడీపీ అభ్యర్థులు ఉన్న చోట జనసేన, జనసేన బలంగా వార్డుల్లో టీడీపీ అభ్యర్థులను పోటీకి నిలపలేరు. ఇక్కడ వైసీపీ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన నాయకులు కృషి చేస్తున్నారు. జనసేన అభ్యర్థుల విజయం కోసం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవరావు ప్రచారం నిర్వహిస్తుండగా, టీడీపీ అభ్యర్థుల విజయం కోసం జనసేన నియోజకవర్గ ఇన్ చార్జి బొమ్మిడి నాయకర్ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే రెండు పార్టీల అభ్యర్థులు కరపత్రాలు, పోస్టర్ లలో టీడీపీ, జనసేన ఉమ్మడి పార్టీ అభ్యర్థులుగా ముద్రించి మరీ బహిరంగంగా ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ మాత్రం నాలుగు వార్డుల్లో అభ్యర్థులను పోటీకి నిలిపి ఒంటరిగా పోరాటం చేస్తున్నది.

అదే విధంగా జంగారెడ్డి గూడెం మున్సిపాలిటీలోనూ పలు వార్డుల్లో జనసేన, టీడీపీ పొత్తు రాజకీయం కొనసాగుతోంది. అదే మాదిరిగా ఏలూరు కార్పోరేషన్ లోనూ పలు డివిజన్ లలో టీడీపీ అభ్యర్థులను ఉపసంహరించుకున్నది. ఆ డివిజన్ లలో జనసేనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నది. ఈ వ్యవహారాలపై రాష్ట్ర బీజెపీ, జనసేన నాయకత్వాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి మరి.

Related posts

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N