Allu Arjun : ఈ మధ్యకాలంలో ఏ సినీ సెలబ్రిటీ పుట్టినరోజు వేడుక అయిన ఆ రోజు వారి సినిమాలకు సంబంధించి నటువంటి టైటిల్ పేరు, ట్రైలర్ లేదా సినిమా విడుదల తేదీని, కొత్త సినిమా గురించి చెప్పడం వంటివి పుట్టినరోజు కానుకగా విడుదల చేయటం ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ అయిపోయింది. ఇప్పటికే ఎంతోమంది హీరోల పుట్టినరోజు కానుకగా వారి సినిమాల సంబంధించినటువంటి విషయాలను తెలిపారు. తాజాగా ఏప్రిల్ 8న టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో అభిమానులకు అల్లు అర్జున్ సినిమాల గురించి డబల్ ధమాకా వార్తలను తెలియ చేయనున్నట్లు సమాచారం.
ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా.. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న “పుష్ప” సినిమా టీజర్ విడుదల చేయాలనే ఆలోచనలో దర్శకుడు సుకుమార్ ఉన్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఒక లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 13న విడుదల చేయనున్నట్లు ఇదివరకే చిత్రబృందం ప్రకటించింది.
కొరటాల దర్శకత్వంలో అల్లు అర్జున్:
పుష్ప సినిమా అనంతరం అల్లు అర్జున్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారనే సమాచారం వినబడుతోంది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టైటిల్ ను విడుదల చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలే కాకుండా అల్లు అర్జున్ తన కొత్త ప్రాజెక్టు గురించి తెలియజేసే అవకాశాలు ఉన్నాయంటూ సినీ వర్గాల సమాచారం. ఈ లెక్కన చూస్తే అల్లు అర్జున్ పుట్టిన రోజు తన సినిమాలకు సంబంధించిన విషయాలను విడుదల చేస్తూ అభిమానులకు పెద్ద ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికీ దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 13న విడుదల కానుంది
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!