Health: ఎప్పుడు ఆరోగ్యం గా ఉండాలంటే ఎవ్వరి ఆరోగ్యం గురించి వారు శ్రద్ధ తీసుకుంటూ కొన్ని జాగ్రత్తలు పాటించవలిసిందే.. ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే ద్రవ పదార్థాలు ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఆహారంలో ఉప్పు చాలా తక్కువగా వేసుకు నేందుకు ప్రయత్నించండి. తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్ల ఉండేలా చూసుకోవాలి . ఇవి శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
ఒకే సారి ఎక్కువగాను లేదా మరీ తక్కువ గాను ఆహారాన్ని తినకండి సమానంగా తినండి. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ అనేది చాల ముద్యమైనది.. అది మాత్రం ఎట్టి పరిస్థితులలో మానకండి. రాత్రిపూట తినే ఆహారం చాలా తక్కువగా ఉండేలా జాగ్రత్త పాడడం తో పాటు వీలయినంత త్వరగా తినడానికి ప్రయత్నం చేయండి. అన్నిటి కన్నా ముఖ్యమైనది ఏమిటంటే ఆహారం ఎప్పుడు ఏది తిన్నాకూడా బాగా నమిలి తినడం అనేది మరువద్దు.. తినడం మొదలు పెట్టిన తర్వాత దాదాపు 15 నిమిషాల పాటు లేదా నలభై సార్లు ఆహారాన్ని నెమ్మదిగా బాగా నమిలి తింటే 12 శాతం బరువు తగ్గగలరని ఆ అధ్యయనంలో తేలింది. మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసే ముందు సలాడ్ తీసుకోవడం మంచిది.
గోధుమ పిండి నిజల్లించకుండా రొట్టెలు చేసుకుని తినండి. ఎందుకంటే ఇందులోనున్న పీచు పదార్థం వలన శరీరానికి చాలా ప్రయోజనం ఉంది. కూరగాయల పైన చెక్కు తీయకుండా పలచగా గీకి పొట్టు తీసేలాగా మాత్రమే చేయండి. ఫాస్ట్ ఫుడ్‌ను ఎంత తక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆహార నియమాలు పాటిస్తూ.. వీలైనంత తక్కువగా ఆహారాన్ని తినేందుకు ప్రయత్నించండి.
ఆహారంలో పసుపు, నారింజ, ఆకుపచ్చ రంగుల్లో ఉన్న కూరగాయలు తప్పక ఉండేటట్టు చూసుకోండి. ఏ సీజన్లో దొరికే పండ్లను ఆ సీజన్లో ప్రతి రోజు తినాలి . కనీసం రోజుకు ఒక పండు నైనా ఆహారంగా తీసుకోవాలి.