NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Revanth Reddy: విశాఖ ఉక్కుపై తెలంగాణలో పోరు..! కేటీఆర్ పై రేవంత్ సెటైర్లు..!

PCC Revanth Reddy; Challenges Changes to PCC

Revanth Reddy: రేవంత్ రెడ్డి Revanth Reddy టీఆర్ఎస్ ఏం చేసినా ఓ పథకం ప్రకారమే చేస్తుందంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. రీసెంట్ గా మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటనే రేవంత్ కౌంటర్ కు కారణమైంది. ఏపీలో విశాఖ ఉక్కు ఉద్యమం ఉధృతంగా జరుగుతోంది. కార్మిక, ఉద్యోగ సంఘాలు, రాజకీయ నాయకులే కాదు.. సినిమా రంగం నుంచి చిరంజీవి కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు. అనూహ్యంగా తెలంగాణ నుంచి మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ‘విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాం. ఈరోజు వారి వరకూ వచ్చింది.. రేపు మన వరకూ కూడా రావొచ్చు. అవసరమైతే విశాఖ కూడా వస్తాం’ అన్నారు. ఈ ప్రకటనపై రేవంత్ రెడ్డి ఘాటుగానే స్పందించారు.

Revanth Reddy satires on ktr
Revanth Reddy satires on ktr

‘తెలంగాణలోని సమస్యలపై ఢిల్లీలో పోరాడలేని వాళ్లు విశాఖ ఉక్కుపై ఏపీలో పోరాడాతారంట’ అని ఎద్దేవా చేశారు. ఇదొక కొత్త నాటకమని రేవంత్ రెడ్డి ఓ బహిరంగ లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ఏపీపై ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. విభజన హామీలపై పోరాటం, తెలంగాణకు రావాల్సిన వాటిపై ఢిల్లీలో పోరాడటం, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలపై పార్లమెంట్ లో పోరాడలేని వాళ్లు ఏపీ సమస్యలపై పోరాడుతారా? అని ఎద్దేవా చేశారు. మోదీ అంటే టీఆర్ఎస్ నాయకులకు భయం పట్టుకుందని విమర్శించారు. ఢిల్లీలో పోరాడటం మానేసి మానేసి మోదీని వేడుకుని వస్తున్నారంటూ విమర్శించారు. పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు పోరాడటం మానేసి రాజీ పడుతున్నట్టుంది..! అంటూ ఎద్దేవా చేశారు.

కేటీఆర్ చేసిన ప్రకటనలో.. ఈరోజు విశాఖ ఉక్కు వరకూ వస్తే రేపు తెలంగాణలో బీహెచ్ఈఎల్, సింగరేణి.. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం వరకూ వస్తారని అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ విమర్శలకూ ఓ కారణముంది. కొన్నేళ్ల క్రితం జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా భీమవరం కోడి పందాలు.. టీఆర్ఎస్ అంటే తెలుగు రాష్ట్ర సమితి.. అనే వ్యాఖ్యలతో అక్కడి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అలానే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు కోసమే విశాఖ ఉక్కు ఉద్యమానికి కేటీఆర్ మద్దతు ఇస్తామని అంటున్నారనేది రేవంత్ వ్యాఖ్యల్లోని మర్మం. మరి.. ఎవరి వాదనలో నిజముందో..! లోగుట్టు పెరుమాళ్లకెరుక..!

 

 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N