NewsOrbit
తెలంగాణ‌ బిగ్ స్టోరీ

Hydrabad : హైదరాబాద్ నెత్తిన పిడుగు!

Hydrabad : కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ దిశగా ఇప్పుడు తెలంగాణకు తాకింది. ఇప్పటికే ఆంధ్రాలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మీద ఉద్యమం నడుస్తున్న వేళ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్రం ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగానూ పెట్టుబడుల ఉపసంహరణకు ముందుకు వెళుతోంది.

Hydrabad  రాజీవ్ గాంధీ విమానాశ్రయం సాక్షిగా…

పెట్టుబడి ఉపసంహరణ చర్యల్లో భాగంగా హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం లో ప్రభుత్వానికి ఉన్న మొత్తం విక్రయించాలని నిర్ణయించారు. భారత విమానాశ్రయాల

Hydrabad
Hydrabad

ప్రాధికార సంస్థ కు, రాష్ట్ర ప్రభుత్వానికి కలిపి ఈ విమానాశ్రయంలో ప్రస్తుతం 26 శాతం వాటా ఉంది. సంయుక్త భాగస్వామ్యంలో మిగిలిన వాటాలను విక్రయించే నిధులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాబట్టుకుంది. ఇక మిగిలిన వాటా ను సైతం విక్రయించి పూర్తిస్థాయి ప్రైవేట్ వారికి అప్పగించే యోచన చేస్తోంది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 2.5 లక్షల కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత ప్రభుత్వం ప్రస్తుతం విమానాశ్రయాల పై దృష్టి సారించినట్లు అర్థమవుతోంది.

100 శాతం విక్రయం

ఇప్పటికే హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మహానగరాల్లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వాటాను క్రమక్రమంగా అమ్మేసింది. వంతుల వారీగా మొత్తం వాహనాలను విక్రయించగా ప్రస్తుతం హైదరాబాదులో మిగిలి ఉన్న 26 శాతాన్ని సైతం వదిలించుకొని పూర్తిస్థాయి ప్రైవేట్ విమానాశ్రయం గా మార్చాలని భావిస్తోంది. అలాగే ముంబై విమానాశ్రయంలోని 27 శాతం వాటా, ఢిల్లీ విమానాశ్రయంలో ని 46 శాతం వాటాలను, బెంగుళూరు విమానాశ్రయంలో 26 శాతం వాటాను సైతం విక్రయించి తదుపరి మిగిలిన విమానాశ్రయాలను దశలవారీగా ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిపై త్వరలో జరగబోయే కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేయడానికి రంగం సిద్ధమైంది.

అదానికి కట్టబెడుతూ!

2021 22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉన్న మరో 13 విమానాశ్రయాలను పూర్తిస్థాయి ప్రైవేటుపరం చేయనున్నారు. గత నెలలో జరిగిన భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ సాధికార సమావేశంలో ఇప్పటికే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. విమానాశ్రయాల ప్రైవేటీకరణ మోదీ సర్కారు నిర్ణయం తీసుకున్న తర్వాత దేశంలోని ఆరు విమానాశ్రయాలను అదానీ గ్రూప్ పొందింది. పూర్తిస్థాయి నిర్వహణ చూసుకుంటోంది. ప్రస్తుతం భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ చేతిలో వందకు పైగా విమానాశ్రయాలు ఉన్నాయి. వీటిలో తొలిదశలో కీలకమైన అంతర్జాతీయ విమానాశ్రయాలను ప్రైవేటీకరణ చేసి తర్వాత మిగిలిన వాటి పైన దృష్టి పెట్టాలని కేంద్రం భావిస్తోంది. దీనిలో భాగంగానే 100 శాతం పెట్టుబడులు ఉపసంహరించి ప్రైవేటు వారికి ఇవ్వబోతోంది. ఎక్కువ భాగం ఆ దాని గ్రూపు వీటిని దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దేశంలోని విమానయాన రంగం మొత్తం టేక్ అప్ చేయడానికి ఎప్పటికీ అదాని గ్రూప్ రంగం సిద్ధం చేసుకుందని, త్వరలో జరగబోయే మిగిలిన ద్వితీయ శ్రేణి విమానాశ్రయాలలో సైతం అతని గ్రూపు చేజిక్కించుకునే అవకాశం పుష్కలంగా ఉందనేది మార్కెట్ నిపుణుల మాట.

Related posts

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో షాక్ .. కాంగ్రెస్ కండువా కప్పుకున్న మరో కీలక నేత

sharma somaraju

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

BRS: కేసిఆర్ పై కీలక నేత సంచలన వ్యాఖ్యలు

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Sri Rama Navami: భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

sharma somaraju