NewsOrbit
జాతీయం న్యూస్

Privatization : శరవేగంతో ప్రైవేటీకరణ!ఈసారి టార్గెట్ నాలుగు జాతీయ బ్యాంకులు!ఖాతాదారుల గుండెల్లో బాంబులు!

Privatization : ఏది దొరికితే దాన్ని ప్రైవేటీకరణ చేసేయటానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు.విశాఖ స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణ వ్యవహారం పై రచ్చ రచ్చ జరుగుతున్నా కేంద్రం వైఖరిలో ఏమాత్రం మార్పులేదు.తాజాగా పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా ఫిబ్రవరి 1, 2021న బడ్జెట్‌ సందర్భంగా ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామణ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

Accelerated privatization! This time the target is four national banks!
Accelerated privatization! This time the target is four national banks!

అయితే ఆ సమయంలో ఆ నాలుగు బ్యాంకుల పేర్లను వెల్లడిచంకపోయినా.. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియా ఓవర్సీస్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను ప్రభుత్వం ప్రైవేటీకరించనున్నట్లు సమాచారం. అయితే ఈ నాలుగు బ్యాంకులు 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీకరించనున్నాయి. ఈ బ్యాంకులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా, బ్యాంకింగ్‌ రంగంలో మొదటి దశ, ప్రైవేటీకరణలో కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడంపై ఎక్కువ దృష్టి సారించింది. ప్రభుత్వ బ్యాంకుల్లో వాటాను విక్రయించడం ద్వారా ఆదాయాన్ని పెంచాలని, ఆ డబ్బును ప్రభుత్వ పథకాలపై ఉపయోగించాలని కేంద్రం భావిస్తోంది. 2021-22లో పెట్టుబడుల నుంచి రూ.1.75 లక్షల కోట్లు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దేశంలో రెండో అతిపెద్ద చమురు సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌)లో తన మొత్తం వాటాను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Privatization : ఖాతాదారులు కంగారుపడక్కర్లేదు!

బ్యాంకుల ప్రైవేటీకరణ కారణంగా కస్టమర్లలో కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది. దీని వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బ్యాంకు కస్టమర్లకు ఎలాంటి నష్టం ఉండదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ నాలుగు బ్యాంకుల్లో ప్రస్తుతం 2.22 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో తక్కువ మంది సిబ్బంది ఉన్నందున దాని ప్రైవేటీకరణ సులభంగా ఉండవచ్చని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. అయితే బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడంపై బ్యాంకర్లు గత రెండు రోజులుగా సమ్మె చేపట్టారు. ప్రైవేటీకరణ చేయవద్దని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల తాము ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంటుందని బ్యాంకింగ్‌ సేవలు మునుపటిలాగే కొనసాగించాలని వారు కోరుతున్నారు. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై ప్రభుత్వంతో చర్చిస్తున్నామని ఈ సందర్భంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్‌ శక్తికాంతదాస్ గురువారం అన్నారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N