Thalaivi : తమిళనాడు దివంగత మాజీ సీఎం, సినీ నటి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం తలైవి… ఈ సినిమాలో కంగనారనౌత్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అరవిందస్వామి మధుబాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. మధుబాల కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తాజాగా మేకర్స్ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు..
తలైవి లో ఎంజీఆర్ సతీమణి జానకి రామచంద్రన్ గా నటిస్తోంది మధుబాల. హాస్పిటల్లో బెడ్ పై ఉన్న ఎం.జి.రామచంద్రన్ తో ఆప్యాయంగా మాట్లాడుతున్న స్టిల్ అందరిని ఆకర్షిస్తోంది. మధుబాల కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ న్యూ లుక్ పోస్టర్ను షేర్ చేసింది కంగనారనౌత్. విబ్రీ మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్మైన్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని తెలుగు , తమిళం , హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాను ఏప్రిల్ 23 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!