NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Mamata Banerjee: యోధురాలికి నేడే పరీక్ష..! మమతకు హ్యాట్రిక్ దక్కేనా..?

big task to mamata banerjee

Mamata Banerjee: మమతా బెనర్జీ Mamata Banerjee ఈ పేరు వింటేనే బెంగాల్ రాజకీయ బెబ్బులి అనే మాట వస్తుంది. మహిళ తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు.. అని నిరూపించిన వారిలో మమత ఒకరు. దశాబ్దాలుగా నాటుకుపోయిన వామపక్షాల కోటల్ని పదేళ్ల క్రితం ఆమె బద్దలకొట్టిన తీరుకు దేశం మొత్తం ఆశ్చర్యపోయంది. కాంగ్రెస్, వామపక్షాలతో నిండిపోయిన బెంగాల్లో ప్రాంతీయ పార్టీ బలమేంటో చూపించారు.  సింగూర్ భూసేకరణలో రైతులకు మద్దతుగా చేపట్టిన దీక్ష, నందిగ్రామ్‌లో పోలీసుల కాల్పుల్లో బాధితుల కోసం చేసిన పోరాటం ఆమెను భవిష్యత్ బెంగాల్ సారధిని చేశాయి. 2011లో ఆమె బెంగాల్ సీఎం అయ్యారు.

big task to mamata banerjee
big task to mamata banerjee

కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి తృణమూల్ కాంగ్రెస్ ను స్థాపించారు. 13 ఏళ్లకే బెంగాల్లో వామపక్షాల పునాదులు కూల్చేసి సీఎం అయ్యారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆమె చేసిన పోరాటం, బెంగాలీల కోసం ఏదో చేయాలనే ఆమె తపన, పరిస్థితులకు వెరవని ఆమె ధీరత్వం, ఎదురెంతటి వారున్నా పోరాడే తీరు.. బెంగాలీలకు ఆమెను ఆశాదీపంలా మార్చేశాయి. 2011లో సీఎం అయితే.. 2016లో మరింత ధీటుగా ప్రజల మనసుల్ని గెలిచి మలిసారి సీఎం అయ్యారు. దేశం మొత్తాన్ని గడగడలాడిస్తున్న నరేంద్ర మోదీ, అమిత్ షాలను.. కొన్నేళ్లుగా ఆమె ఢీకొంటున్న తీరే ఇందుకు నిదర్శనం. బెంగాల్లో ఒకప్పుడు వామపక్షాల ఆధిపత్యాన్ని కూల్చేయాలని మమత ఎలా తాపత్రయపడ్డారో.. నేడు మమత ఆధిపత్యం నుంచి బెంగాల్ ను తమ వశం చేసుకోవాలనేది బీజేపీ ఆలోచన.

 

అయితే.. నాడు వామపక్షాలపై మమత ఒంటరి పోరు .. నేడు మమతపై బీజేపీ వ్యవస్థ మొత్తం పోరు. ఇన్నాళ్లూ మమతకు బలంగా ఉన్న ముకుల్ రాయ్, శుభేందు అధికారి ఇప్పుడు ఆమె పక్కన లేరు. అయినా.. ఆమెలో ధీరత్వం సడలలేదు. నేడు మమత పోటీ చేస్తున్న నందిగ్రామ్ లో ఎన్నిక జరుగుతోంది. శుభేందు నియోజకవర్గం అది. అయినా.. ఆమె అక్కడినుంచే పోటీ చేసి శుబేంధును అక్కడే ఓడించి తానేంటో నిరూపించాలని ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్లూ మమతను పక్కనే ఉండి చూసిన శుభేందు ఆమెను తక్కువ అంచనా వేస్తారనుకోవడం పొరపాటే. శుభేందుకి అక్కడ పట్టుందని తెలిసినా నందిగ్రామ్ నుంచే పోటీ చేయడం.. ముందుచూపుతో మరో నియోజకవర్గంలో పోటీకి వెళ్లకపోవడమే.. ‘మమతా బెనర్జీ’. మరి బెంగాలీల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

Related posts

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju