NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి దెబ్బ మీద దెబ్బ..!!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “వకీల్ సాబ్” సినిమా భారీ స్థాయిలో విజయం సాధించిన గాని ఏపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆ సినిమా కలెక్షన్ లకి భారీగా దెబ్బ వేసిన సంగతి తెలిసిందే. థియేటర్లకు అనేక రాయితీలు ఇవ్వగా.. మళ్లీ టికెట్ రేట్లు చూపించడం సరైన విధానం కాదని వైసీపీ ప్రభుత్వం “వకీల్ సాబ్” సినిమా విషయంలో కఠినంగా వ్యవహరించడం జరిగింది. ఇదిలా ఉంటే రాజకీయపరంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి మరో భారీ దెబ్బ పడింది. మేటర్ లోకి వెళితే జనసేన పార్టీకి మాదాసు గంగాధరం రాజీనామా చేశారు.

Pawan Kalyan had shocking twist politically
Pawan Kalyan had shocking twist politically

2019 ఎన్నికల టైంలో పార్టీలోకి వచ్చిన గంగాధరం..ఎన్నికల సమయంలో కీలకంగా రాణించారు. పవన్ కళ్యాణ్ తో అనేక వేదికలు పంచుకున్నారు. పార్టీకి సంబంధించి కీలకమైన కార్యక్రమాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. అటువంటి వ్యక్తి తాజాగా రాజీనామా చేయటం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టడం లేదు.. పార్టీకి విధివిధానాలు లేవు, పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాకలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు చాలా ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి సమయంలో వారికి అండగా బిజెపి దగ్గర స్పష్టమైన హామీ పవన్ కళ్యాణ్ తీసుకోలేక పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ రాజీనామా లేఖ రాశారు.

 

సినిమా ప్రపంచం వేరు రాజకీయ ప్రపంచం వేరు అని తెలిపారు. ఈ రెండింటికీ తేడా తెలియకుండా వ్యవహరిస్తే సీనియర్లు ఎలా కలిసి పని చేస్తారా అని ప్రశ్నించారు. జనసేన ఓ రాజకీయ పార్టీగా పనిచేయటం లేదు అందువల్ల తాను రాజీనామా చేస్తున్నట్లు గంగాధరం పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఏపీ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేతగా పేరొందిన గంగాధరం రాజీనామా చేయటం ఖచ్చితంగా జనసేన పార్టీకి రాజకీయంగా భారీ డ్యామేజ్ జరిగినట్లే అంటూ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.  

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N