NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

YS Sharmila: కేసిఆర్ పై సీరియస్ కామెంట్స్ చేసిన వైఎస్ షర్మిల

YS Sharmila: వైఎస్ షర్మిల నేతృత్వంలో బుధవారం లోటస్ పాండ్ లో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్బంగా తొలుత అంబేద్కర్ జీవిత విషయాలు, ఆ నేత గొప్పతనాన్ని వివరించిన షర్మిల.. తరువాత సీఎం కేసిఆర్ తీవ్ర స్థాయి విమర్శలు చేశారు. దళితులు ఎవరూ సీఎం చేయాలని అడగలేదు కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానంటూ కేసిఆర్ మాట ఇచ్చారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ మాట తప్పారని అన్నారు. అదే విధంగా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత దళితులకు మూడు ఎకరాల చొప్పున పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి ఆ వాగ్దానాన్ని గాలికి వదిలివేశారన్నారు.

YS Sharmila comments on kcr
YS Sharmila comments on kcr

చేవెళ్ల – ప్రాణహిత ప్రాజెక్టుకు నాడు వైఎస్ఆర్ అంబేద్కర్ పేరు పెడితే కేసిఆర్ ఆ ప్రాజెక్టుకు తల తోక తీసేసీ భారీగా అంచనా వ్యయాలను పెంచి అవినీతికి పాల్పడ్డారనీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు పెట్టడానికి మనసు రాలేదన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ప్రచారం నిర్వహించడానికి అడ్డు రాని కోవిడ్ నిబంధనలు అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించడానికి అడ్డువస్తాయని తెలంగాణ ప్రభుత్వం జయంతి వేడుకలను నిర్వహించలేదని విమర్శించారు. దళితులు అంటే కేసిఆర్ కు ఎంత ప్రేమో అంటూ షర్మిల సెటైర్ వేశారు. దళిత ఉప ముఖ్యమంత్రి రాజయ్యపై ఒక్క ఆరోపణ వస్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా పదవి నుండి తొలగించిన కేసిఆర్..మంత్రి మల్లారెడ్డిపై ఎన్ని ఆరోపణలు వస్తున్నా ఆయన చెవికి వినిపించడం లేదని, చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. వీటిని బట్టి చూస్తేనే కేసిఆర్ కు దళితులు అంటే ఎంత ప్రేమో అర్థం అవుతుందని షర్మిల అన్నారు.

త్వరలో తెలంగాణలో రాజకీయ పార్టీని అనౌన్స్ చేయనున్న షర్మిల ప్రతి సందర్భంలోనూ, సభలోనూ టీఆర్ఎస్ సర్కార్ ను, సీఎం కేసిఆర్ ను విమర్శిస్తూనే ఉన్నారు. షర్మిల రాజకీయ అరంగ్రేటం చేస్తున్నారని ప్రకటన వచ్చినప్పటి నుండి షర్మిల వెనుక కేసిఆర్ ఉన్నారంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షర్మిల ఇటీవల ఖమ్మంలో జరిగిన సభలో తన రాజకీయ ప్రవేశం గురించి స్పష్టం చేశారు. కేసిఆర్ రమ్మంటేనో, బీజేపీ పిలిస్తేనో, కాంగ్రెస్ అడిగితేనో పార్టీ పెట్టడానికి రాలేదని తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావాలన్న లక్ష్యంతోనే రాజకీయ పార్టీ స్థాపిస్తున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju