NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Tirupati By Poll: ముగిసిన తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ ..! 5గంటల వరకూ 54.99 శాతం..!!

Tirupati By Poll: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 5 గంటల వరకూ క్యూలైన్ లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. సాయంత్రం 5గంటల వరకూ 54.99 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సిగ్మెంట్ ల వారీగా పోలింగ్ శాతం చూసుకుంటే సర్వేపల్లిలో 57.91 శాతం, గూడూరు అసెంబ్లీ సిగ్మెంట్ లో 51,82, సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో 60.11 శాతం, వెంకటగిరి సిగ్మెంట్ లో 55,88, తిరుపతిలో 45,84, శ్రీకాళహస్తిలో 57,00, సత్యవేడు అసెంబ్లీ సిగ్మెంట్ లో 58.,45 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొత్తం 17,10,699 మంది ఓటర్లకు గానూ 9,40,678 మంది 5గంటల వరకూ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Tirupati By Poll updates
Tirupati By Poll updates

కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. మాస్కులు ధరించిన వారినే పోలింగ్ కేంద్రాలకు అనుమతించారు. పోలింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ ప్రొటోకాల్ పాటించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందనిీ అధికార వై సీ పీ సంతృప్తి వ్యక్తం చేస్తుండగా టీ డీ పీ, బీ జే పీ మాత్రం అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తున్నది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ నేతలు ఉప ఎన్నికను రద్దు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

మే 2వ తేదీ కౌంటింగ్ ప్రక్రియ జరగనున్నది. వైసీపీ తరపున డాక్టర్ గురుమూర్తి, టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి, బీజేపీ – జనసేన అభ్యర్థిగా రత్నప్రభ, కాంగ్రెస్ అభ్యర్థిగా చింతా మోహన్ తదితరులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పక్షాలైన వైసీపీ, టీడీపీ, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి.

 

Related posts

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?