NewsOrbit
రాజ‌కీయాలు

వారికి మీరే బుద్ది చెప్పాలి

నెల్లూరు: ఆదాల ప్రభాకర్ రెడ్డి ఐదేళ్లు పనులు చేయించుకొని తీరా సీటు ఇచ్చాక పార్టీ ఫిరాయించారని ముఖ్య మంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నెల్లూరు, ఒంగోలులో  జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.

టిడిపికి కార్యకర్తలే అసలైన బలమనీ, వచ్చిపోయే నేతలతో పార్టీకి ఒరిగేదేమీ లేదని చంద్రబాబు అన్నారు. స్వార్థం కోసం పార్టీ మారే నేతలకు ప్రజలే బుద్ధి చెప్పాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అన్ని పార్టీలను ఏకం చేసే శక్తి టిడిపికే ఉందని చంద్రబాబు అన్నారు. 25 మంది ఎంపీలుంటే ప్రధానిని ఎంపిక చేసే అవకాశం ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో 150 కి పైగా అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవటం ఖాయమని చంద్రబాబు అన్నారు.

కేసిఆర్, మోది, జగన్‌పై చంద్రబాబు ప్రధానంగా విమర్శలు చేశారు.

కేసిఆర్:

తెలంగాణలో టీడీపీ నేతలందరినీ కేసిఆర్ తన పార్టీలో కలుపుకున్నారనీ, అలాగే కాంగ్రెస్ నాయకులను తీసుకున్నారని చంద్రబాబు అన్నారు. కేసిఆర్ ఏపీకి రాలేరు కాబట్టి, కేసులు ఉన్నాయి కాబట్టి  కాల్మొక్కుతా అనే జగన్‌ను ఎంపిక చేసుకున్నారనీ చంద్రబాబు ఆరోపించారు. తన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకూ వారి ఆటలు సాగనివ్వననీ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

జగన్:

వైఎస్ వివేకానందరెడ్డి హత్యను ఎందుకు గుండెపోటుగా చిత్రీకరించారనీ చంద్రబాబు ప్రశ్నించారు. వివేకా హత్య ఇంటి దొంగలపనేనని ప్రజలు అనుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. హత్య తర్వాత ఆధారాలు లేకుండా చేశారని ఆయన ఆరోపించారు.

బాబాయ్‌ హత్య జరిగితే జగన్‌ దాచిపెట్టాలని చూశారని చంద్రబాబు విమర్శించారు. ఆనాడు టిడిపి నేత పరిటాల రవిని పార్టీ ఆఫీసులోనే దారుణంగా హత్య చేశారన్నారు. వైఎస్‌ హయాంలో వందలాది మంది టిడిపి కార్యకర్తలను చంపారని, కుట్రలు, కుతంత్రాలు చేయడం వైసిపికి అలవాటేనని చంద్రబాబు అన్నారు. ఈ ఎన్నికల్లో వైసిపిని చిత్తుచిత్తుగా ఓడించాలని చంద్రబాబు అన్నారు.

మోది:

మంచివాళ్లకి కాపలా కాయకుండా దొంగలకు సహకరిస్తున్న మోది ఇప్పుడు జగన్‌ను కూడా కాపాడుతున్నారని చంద్రబాబు అన్నారు. ప్రధానమంత్రి కార్యాలయంలో వైకాపా నేతలు తిరుగుతూ లాబియింగ్‌ చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.

Related posts

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Leave a Comment