NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Sajjala Ramakrishna Reddy: ఏపిలో లాక్ డౌన్ పై ప్రభుత్వ నిర్ణయం ఇది..!!

Sajjala Ramakrishna Reddy: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అదే స్థాయిలో ఏపిలోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా కట్టడికి ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ లాంటి కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. లాక్ డౌన్ లాంటి కఠిన ఆంక్షల అమలు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఇష్టాలకు వదిలివేసింది. ఈ నేపథ్యంలో ఏపిలో లాక్ డౌన్ విధించాలన్న డిమాండ్ వినబడుతోంది. ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రాష్ట్రంలో కరోనా కట్టడికి లాక్ డౌన్ లాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొన్నారు. కరోనా కట్టడి చర్యల విషయంలో వైసీపీ ప్రభుత్వ తీరును చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.

Sajjala Ramakrishna Reddy press meet
Sajjala Ramakrishna Reddy press meet

ఈ నేపథ్యంలో వీటిపై ప్రభుత్వ సలహాదారు, రాష్ట్ర వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉందన్నారు. లాక్ డౌన్ విధించాలన్న వాదనలు వినబడుతున్నాయనీ, కానీ లాక్ డౌన్ విధిస్తే ప్రభుత్వం మరింత ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతుందనీ, దానికి తోడు ప్రజలు తీవ్ర ప్రభావానికి గురి అవుతారని అన్నారు. లాక్ డౌన్ ఇప్పటి పరిస్థితుల్లో వీలుకాదని సీఎం జగన్ భావిస్తున్నారని చెప్పుకొచ్చారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందనీ, కరోనా నియంత్రణ చర్యలపై సీఎం జగన్మోహనరెడ్డి నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

ప్రజల ఆక్షాంక్షల మేరకు సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారనీ, ఆర్థిక సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. జగన్ పాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంటే రాష్ట్రానికి రావడానికే భయపడే చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని నీచ రాజకీయాలు చేస్తున్నారని సజ్జల తీవ్ర స్థాయిలో విమర్శించారు. సంక్షోభ సమయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సింది పోయి చంద్రబాబు తన వ్యాఖ్యలతో ఉద్యోగులను, విద్యార్థులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N