NewsOrbit
న్యూస్

TTD: ఆ నోట్ల కట్టలను చూసి టీటీడీ అధికారుల మతిపోయింది!!ఏమిటా కథా కమామిషు?

TTD: అతడో యాచకుడు. రోజంతా యాచించడమే పని. అలా వచ్చిన డబ్బుతో బతుకు సాగిస్తున్నాడు. చూసినోళ్లంతా అతడు చాలా పేదవాడని అనుకున్నారు. కానీ, కట్ చేస్తే.. ఆ యాచకుడు లక్షాధికారి అని తేలింది. అతడి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. అంతా లెక్క వేస్తే అక్షరాల 6లక్షలు ఉంది.తిరుపతిలో ఓ యాచకుడి ఇంట్లో ఏకంగా రూ.6 లక్షలు బయటపడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. శేషాచల నగర్ లోని అతడి నివాసంలో నోట్ల కట్టలు వెలుగుచూశాయి.

TTD officials were stunned when they saw the bundles of notes !!
TTD officials were stunned when they saw the bundles of notes !!

ఎవరీ శ్రీనివాసన్?

ఆ యాచకుడి పేరు శ్రీనివాసన్. తిరుమల కొండపైకి వచ్చే వీఐపీల దగ్గర భిక్షాటన చేసేవాడు. తిరుమల నిర్వాసితుడి కేటగిరీలో అతడికి తిరుపతిలో శేషాచల నగర్ లో ఇంటిని కేటాయించారు.అయితే, శ్రీనివాసన్ అనారోగ్య కారణాలతో గతేడాది మరణించాడు. అతడికి నా అన్నవాళ్లెవరూ లేకపోవడంతో శేషాచల నగర్ లోని అతడి నివాసాన్ని స్వాధీనం చేసుకునేందుకు టీటీడీ అధికారులు అతడి ఇంటికి వెళ్లారు. తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన టీటీడీ అధికారులు ఏమున్నాయా ఆని చూస్తుండగా ఇంట్లో రెండు ట్రక్కు పెట్టెలు కనిపించాయి. అవి తెరిచి చూడగా, అందులో కరెన్సీ కట్టలు కనిపించాయి.దీంతో అధికారులు అవాక్కయ్యారు.వాటి విలువ రూ.6 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. విజిలెన్స్ సమక్షంలో టీటీడీ సిబ్బంది వాటిని లెక్క పెట్టారు.గంటన్నరకు పైగా లెక్కించారు. డబ్బు లెక్కింపు కోసం కరెన్సీ కౌంటింగ్ మెషీన్ కూడా తెప్పించారు. దాదాపు 5మంది సిబ్బంది నగదు లెక్కించారు. శ్రీనివాసన్ ఇంట్లో దొరికన ట్రంకు పెట్టెలో కొన్ని నోట్లు రద్దు చేసినవి(రూ.500, వెయ్యి రూపాయలు) కూడా ఉన్నాయి. అలాగే కొత్త రూ.2వేల నోట్లు కూడా ఉన్నాయి.శ్రీనివాసన్ కొండపై చాలా రకాలుగా డబ్బు సంపాదించే వాడు. యాచకుడిగా చాలా ఏళ్లు కొనసాగాడు. తిరుమలకు వచ్చే యాత్రికుల నుంచి యాచించే వాడు.మొత్తం మీద బాగానే సంపాదించుకున్నప్పటికీ అనుభవించకుండానే శ్రీనివాసన్ ఈ లోకం విడిచి వెళ్లిపోయాడు.

 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N