NewsOrbit
రాజ‌కీయాలు

నర్సాపురం ఎంపి అభ్యర్థిగా నాగబాబు

 

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా సినీ నటుడు నాగబాబు పేరును ఆ పార్టీ ఖరారు చేసింది. బధవారం నాగబాబు జనసేన పార్టీలో చేరారు. నాగబాబు తమ్ముడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకి పార్టీ కండువా కప్పి స్వాగతించి భీ-ఫారాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా టికెట్‌ ఇచ్చినందుకు సోదరుడు పవన్‌కు నాగబాబు కృతజ్ఞతలు తెలిపారు. వరుసకు తనకు తమ్ముడే అయినా తనకు కూడా పవన్‌ నాయకుడేనని నాగబాబు అన్నారు.

రాజకీయాలకు సంబంధం లేకుండా తనదైన జీవితం గడుపుతున్న వ్యక్తిని తాను స్వయంగా పార్టీలోకి రమ్మని ఆహ్వానించానని పవన్‌ తెలిపారు. తనలో రాజకీయ చైతన్యం మొదలైంది తన సోదరుడు నాగబాబు వల్లేనని పవన్ అన్నారు.

దొడ్డి దారిలో కాకుండా ధైర్యంగా తన అన్నయ్యను నేరుగా ప్రజాక్షేత్రంలో నిలబెడుతున్నానని పవన్ చెప్పారు. ఆయన విజయం సాధిస్తారనే నమ్మకం తనకు ఉందని పవన్ ధీమా వ్యక్తంచేశారు.

నర్సాపురం స్థానానికి టిడిపి తరుపున ఆ పార్టీ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే శివరామరాజు, వైసిపి తరుపున రఘురామకృష్ణంరాజు, బిజెపి తరుపున మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు బరిలో ఉన్నారు. నాగబాబు రంగ ప్రవేశంతో పోటీ రసవత్తరంగా మారనుంది. ప్రస్తుతం నర్సాపురం ఎంపిగా బిజెపికి చెందిన గోకరాజు గంగరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

Leave a Comment