NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YS Jagan: ఒక డైరీ వెనుక మొండి ధైర్యం..! జగన్ అమూల్ కథలో నీతి ఏమిటి..!?

ys jagan interest on amul dairy

YS Jagan: వైఎస్ జగన్ YS Jagan గుజరాత్ కు చెందిన అమూల్ డైయిరీని ఏపీకి తీసుకొచ్చారు. ఇందుకు కారణమేంటంటే.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు చెందిన హెరిటేజ్ సంస్థతోపాటు, కొందరు టీడీపీ నాయకుల ఆర్ధిక మూలాలు పాడి పరిశ్రమల్లోనే ఉన్నాయి. సంగం, మోడల్, విశాఖ.. ఇలా డెయిరీల్లో వారికి వాటాలున్నాయి. రైతుల నుంచి పాల సేకరణ చేస్తూ వారికి తక్కువ మొత్తం చెల్లించి పైన వీరు లాభాలెక్కువ పొందుతున్నారని ఓ వాదన. కాబట్టి.. రైతులకు ఎక్కువ లాభం దక్కేలా, టీడీపీ నాయకుల ఆర్ధిక మూలాలు దెబ్బ తినేలా చేయాలనే వ్యూహహే సీఎంకు ఉందని చెప్పాలి. ఇది సదుద్దేశమే అయినా.. అందుకు వేసిన అడుగులు సరైన దారిలో కాదని చెప్పాలి.

ys jagan interest on amul dairy
ys jagan interest on amul dairy

రాష్ట్ర ప్రభుత్వ నిధులను అమూల్ కి పెట్టొద్దు అని ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులే దీనిని నిరూపిస్తున్నాయి. నిజానికి అమూల్ సంస్థ ఉత్తరాదిలో లాభార్జనే కాకుండా బ్రాండింగ్ లో కూడా టాప్ లో ఉంది. కానీ.. సౌత్ లో ఫెయిల్ అయింది. హైదరబాద్ లో గతంలోనే విఫలమైన సంస్థ. ఇప్పుడు జగన్ దీనిని ఏపీకి తీసుకొచ్చారు. హెరిటేజ్ సంస్థకు రోజుకు జరుగుతున్న 15లక్షలకు పైగా పాల సేకరణను అమూల్ సంస్థకు సేకరించేలా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు ఒంగోలు డెయిరీని కూడా అమూల్ కు ఇచ్చారు. కానీ.. రోజుకు 15వేల లోపు లీటర్లు మాత్రమే పాల సేకరణ జరుగుతోంది. ఏపీలో ఎవరూ అమూల్ కు పాలు పోసేందుకు ఇష్టపడటం లేదు.

Read More: Covid Hospital: ఏపీ ప్రభుత్వం అద్భుతం..! 15 రోజుల్లోనే కోవిడ్ ఆసుపత్రి నిర్మాణం

నిజంగా సీఎంకు పాడి రైతుల అభివృద్ధే ముఖ్యం అనుకుంటే.. ప్రభుత్వ సంస్థలైన ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలెప్ మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ (apddcf), లేదా నేషనల్ డెయిరీ డెవలెప్ మెంట్ బోర్డ్ (nddb)లకే ప్రభుత్వ నిధులను ఇచ్చి ఏపీలోని రైతుల నుంచి పాల సేకరణ చేస్తే సరిపోయేది. ఇదే చేస్తే జగన్ ఆలోచన మేరకు టీడీపీ నాయకుల ఆర్ధిక మూలాలపై దెబ్బ వేసినట్టూ ఉండేది.. రైతులకు మేలూ జరిగేది. దీనికి సచివాలయ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించుకుని రైతులకు మేలు చేయొచ్చు. కానీ.. జగన్ గుజరాత్ కు చెందిన సంస్థనే ఎందుకు తెర మీదకు తెచ్చారన్నది ప్రశ్న. ఇప్పటికే గంగవరం, కృష్ణపట్నం పోర్టుకు కూడా గుజరాత్ సంస్థకే అప్పగించింది ప్రభుత్వం. గుజరాత్ పై ప్రేమేంటో.. హైకోర్టే తేల్చాలి..!

Related posts

Lok Sabha Elections 2024: సొంతిల్లు, కారు లేదు కానీ ప్రధాని మోడికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయంటే..?

sharma somaraju

Chandrababu: ఆ చెల్లింపులు ఆపించండి సారూ .. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు చంద్రబాబు లేఖ

sharma somaraju

Pulavarti Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి పులవర్తి నానిపై దాడి .. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

sharma somaraju

Jagan: జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

sharma somaraju

Lok sabha Elections 2024: వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ .. హజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

sharma somaraju

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

sharma somaraju

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?