NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Balakrishna Comments: టీడీపీలో బాలయ్య లెక్కలు – లాజిక్కులు “ప్లస్సా – మైనస్సా”..!? ఎవరి వాదనలు వారివే..!!

Balakrishna Comments: Viral in TDP Plus or Minus

Balakrishna Comments: “బాలకృష్ణ మాటలు టీడీపీ ప్లస్సా..!? మైనస్సా..!? ఒక్కోసారి ప్లస్ అవుతాయి. ఒక్కోసారి మైనస్ అవుతాయి. కొన్ని సార్లు ప్లాన్ అయి కూడా మైనస్ అవుతాయి. ఓవరాల్ గా ఎక్కువగా మైనస్ మాత్రమే అవుతాయి..” ఈ ప్లస్సులు, మైనస్సుల గోల తెలియాలి అంటే నిన్న బాలకృష్ణ మాట్లాడిన మాటలు ఓ సారి వినాలి. స్పష్టంగా తెలుసుకోవాలి.. టీవీ 9 ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో నిన్న బాలకృష్ణ కొన్ని వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మీ అభిప్రాయం ఏమిటి..? అనే ప్రశ్నకు కొన్ని లాజిక్కులు, లెక్కలు చెప్పారు. కానీ అవి అర్ధం కాక చాలా మంది టీడీపీ వాళ్ళే బుర్రలు గోక్కుంటున్నారు. వాటి వెనుక వ్యూహమా..!? వివాదమా..!? ఉద్దేశమేమిటో తెలుసుకోలేక సతమతమవుతున్నారు..!

Balakrishna Comments: Viral in TDP Plus or Minus
Balakrishna Comments: Viral in TDP Plus or Minus

Balakrishna Comments: వ్యాఖ్యలు – ఉద్దేశాలు ఇవీ..!!

నిన్న బాలకృష్ణ ఏమన్నారంటే..!? “రాజకీయ ఎంట్రీపై ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి ఇష్టా ఇష్టాలు వారివి… వాళ్ల ఇష్టాన్ని బట్టి వాళ్లు ఎంచుకుంటారు. ఎన్టీఆర్ వస్తాడా? రాడా? అనే డాన్ గురించి ఐ యామ్ నాట్ బాధర్డ్.. ఆయన వస్తే ప్లస్ అయి మైనస్ అవ్వచ్చు. ఎన్ టీ రామారావు గారు అయ్యారు కదా అని… సినిమాల్లో ఉన్నాం కదా అంటే.. నేను ఉన్నాను, నా గురించి అందరికీ తెలుసు. ఐయామ్ ట్రాన్పిరెంట్ పర్సన్” అంటూ బాలయ్య కుండబద్ధలు కొట్టినట్టు చెప్పేసారు.. వీటి ఉద్దేశాలేమిటా..!? అని అర్ధం కాక చాలా మంది ఇప్పుడు దీర్ఘాలోచనలు చేస్తున్నారు… ఇప్పుడు రకరకాల చర్చలు, వివాదాలు, వ్యూహాలు లెక్కేలేసుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలను ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు తీసుకుంటున్నారు.

కొందరు “ఇది చంద్రబాబు వ్యూహం ప్రకారమే బాలయ్య మాట్లాడారని… జూనియర్ వచ్చినా టీడీపీలో పెద్దగా ప్రయోజనం ఉండదు అన్నట్టు బాలకృష్ణ చేత చెప్పించి.. టీడీపీ శ్రేణులకు పరోక్షంగా సందేశం ఇప్పించారని” విశ్లేషించుకున్నారు.

Balakrishna Comments: Viral in TDP Plus or Minus
Balakrishna Comments: Viral in TDP Plus or Minus

కొందరు “బాలకృష్ణకి తన అల్లుడు ముఖ్యం కాబట్టి.. టీడీపీ వారసుడిగా నారా లోకేష్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి.. జూనియర్ రాకపై ఇష్టం లేకనే అలా మాట్లాడారని” చెప్పుకుంటున్నారు..

కొందరు “పార్టీలో ట్రాన్సుపేరెన్సి ఉండాలి అని చెప్పడం ద్వారా… జూనియర్ లో ఆ లక్షణం లేదని.., జూనియర్ బయటకు కనిపించేలా ఒకటి.. లోపల మరోలా ఆలోచిస్తారని.. అది పార్టీలోనూ.., రాజకీయంగా మంచిది కాదని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు కాబట్టే ప్లస్ అయి మైనస్” అవ్వొచ్చు అని చెప్పుకుంటున్నారు.

ఇలా బాలకృష్ణ వ్యాఖ్యలపై ఎవరి వాదనలు వారికి ఉన్నాయి… టీడీపీలోనే బాలయ్య – చంద్రబాబు అనుకూల వర్గం మాత్రం “బాలకృష్ణ మనస్తత్వాన్ని బాగా అర్ధం చేసుకుంటే.., ఆయన వ్యాఖ్యలో దురుద్దేశాలు, అంతరార్ధాలు.., ద్వంద్వార్ధాలు ఏమి ఉండవు. “జూనియర్ వస్తే రావచ్చు. కానీ ఓపెన్ హార్ట్ తో రావాలి. ఫెయిల్యూర్ కి కూడా సిద్ధపడే రావాలి. ప్లస్ అవుతానని రాకుండా.. ప్లస్ అయినా, మైనస్ అయినా ఎదుర్కొంటానని నమ్మి.. యూత్ కి బాసటగా ఉండేలా రావాలి” అనే ఉద్దేశాన్ని కూడా చూడొచ్చు. అంటూ విశ్లేషించుకుంటున్నారు..!

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?