Maa: టాలీవుడ్ ఇండస్ట్రీలో మా అసోసియేషన్ చాలా కీలకం. ఇండస్ట్రీలో నటీనటుల బాగోగులను వారి సమస్యలను ఇంకా అనేక రకాల సినిమా కష్టాలను మా అసోసియేషన్ చూసుకుంటూ డీల్ చేస్తూ ఉంటది. ఎలాంటి కష్టం నటీనటులకు వచ్చిన వెంటనే అసోసియేషన్ సభ్యులు రంగంలోకి దిగి వారిని ఆదుకుంటారు. కరోనా సమయంలో కూడా మా అసోసియేషన్ అనేక రకాల సేవలు చేయడం జరిగింది. ఇండస్ట్రీలో ఈ మా అసోసియేషన్ అధ్యక్షుడు కోసం ఎలక్షన్లు కూడా జరుగుతూ ఉంటాయి.
ప్రస్తుతం “మా” అసోసియేషన్ అధ్యక్షడు గా నరేష్ వ్యవహరిస్తున్నారు. త్వరలో ఆయన పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కొత్త అధ్యక్ష పదవి కోసం చాలా మంది పోటీ పడుతున్నారట. అయితే పోటీకి ఈసారి ఎలక్షన్లో నటుడు ప్రకాష్ రాజ్ కూడా రెడీ అవుతున్నట్లు… సమాచారం. మామూలుగానే నటుడిగా ప్రకాష్ రాజ్ అనేక సహాయ కార్యక్రమాలు చేయడం మాత్రమే కాక తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిపోయిన రెండు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి పనులు చేశారు.
Read More: Prakash Raj: ప్రకాశ్ రాజ్.. వయసుకి మించి మెప్పించిన పాత్రలివే..!
అదే రీతిలో ప్రభుత్వాలు ప్రజలపై ఇష్టానుసారం వ్యవహరిస్తే ప్రశ్నించే తత్వం కలిగిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న ప్రకాష్ రాజ్ మా అధ్యక్ష పదవికి రెడీ అవుతున్నట్లు వార్తలు రావడంతో ఇండస్ట్రీలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఒక ప్రకాష్ రాజు మాత్రమే కాకుండా ఇంకా చాలామంది మంచు విష్ణు మరికొంత మంది నటీనటులు ఈ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.