NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Tdp: లోకేశ్-అచ్చెన్నకు మధ్య పొసగట్లేదా..? పార్టీలో విబేధాలున్నాయా?

communication gap in telugu desam

Tdp: తెలుగుదేశం Tdp తెలంగాణలో ఉనికి కోల్పోయిన పార్టీ.. ఏపీలో ప్రతిపక్ష హోదాలో ఉంది. 2019 ఓటమి నుంచి ఇంకా తేరుకోలదనే చెప్పాలి. చంద్రబాబు ఆధ్యక్షతన ఒంటరి పోరే సాగిస్తున్నారు. పార్టీ నేతల్లో గతంలో అధికారం చెలాయించిన వారిలో చాలామంది సైలెంట్ గానే ఉండిపోయారు. తమ ప్రాభవంతో గెలిచిన వారి వాయిస్ మాత్రమే వినపడుతోంది. రాజకీయ పరిణామాల నేపథ్యంలో, పార్టీని కొత్తగా ప్రొజెక్ట్ చేయాలనే ఉద్దేశంలో అచ్చెన్నాయుడికి పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. అచ్చెన్న కూడా ప్రభుత్వాన్ని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. అయితే.. పార్టీలో లోకేశ్ తో ఆయనకు పొసగడం లేదనే వార్తలు వస్తున్నాయి. వీరిద్దరికీ మధ్య దూరం పెరిగిందనేది పార్టీ శ్రేణుల్లో అనుకుంటున్న మాట. ఇందుకు కారణం లేకపోలేదు..

communication gap in telugu desam
communication gap in telugu desam

ఆమధ్య పార్టీ గురించి అచ్చెన్నాయుడు చేసినట్టుగా వైరల్ అయిన వ్యాఖ్యలపై లోకేశ్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. దీనిపై పార్టీ, చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు.. పబ్లిగ్గా స్పందించింది లేదు. అయితే.. పార్టీకి డ్యామేజ్ మాత్రం జరిగింది. నేతలు, కార్యకర్తల్లో ఈ మాటలు ప్రభావం చూపిస్తే.. ప్రజల్లోకి మరోలా వెళ్లాయని చెప్పాలి. అప్పటి నుంచే అచ్చెన్నతో లోకేశ్ కాస్త దూరం పాటిస్తున్నారని తెలుస్తోంది. అయితే.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే లోకేశ్ తీరు చర్చాంశనీయమైంది. తాడేపల్లిలోని కేఎల్ యూనివర్శిటీలో పార్టీ క్రమశిక్షణా మీటింగ్ జరిగినప్పుడు అప్పటి హోంమంత్రి చినరాజప్పపై లోకేశ్ దబాయించారనే వార్త అప్పట్లో హైలైట్ అయింది. అప్పట్లోనే యనమలకు కూడా లోకేశ్ తీరు నచ్చేది కాదని.. వారిమధ్య కూడా సఖ్యత ఉండేది కాదని వార్తలు వచ్చాయి.

Read More: Nara Lokesh: 2024 ఎన్నికలు..! లోకేశ్ ఆలోచన మారుతోందా..?

పార్టీ అధ్యక్ష పదవిని లోకేశ్ తాను సూచించిన వ్యక్తికే కట్టబెట్టేలా చక్రం తిప్పాలనే ప్రయత్నాలు చేసారని అంటారు. పార్టీలో తన ముద్ర ఉండేలా చూసుకోవడంలో భాగంగా లోకేశ్ చేసుకున్న ప్రయత్నాలని చెప్పాలి. ఇటివల జరిగిన మహానాడులో కూడా పార్టీలోకి యువరక్తం అవసరమని బాలకృష్ణ ఆమధ్య అన్నారు. ఈక్రమంలోనే పార్టీలో లోకేశ్ తనదైన ముద్ర వేసుకునే క్రమంలో అచ్చెన్న చేసిననట్టు వైరల్ అయిన వ్యాఖ్యలపై ఇప్పటికీ గుర్రుగా ఉన్నారనే టాక్ ఉంది. మరి.. వీరిమధ్య వైరం ఉందనే మాటల్లో ఎంత నిజముందో కానీ.. వైరం ఉన్నా గుంభనంగా ఉండటమే ఉత్తమం. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో వైరం బయటకు వస్తే.. ప్రజల్లోకి కొత్త సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది..!

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N