NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Nara Lokesh: 2024 ఎన్నికలు..! లోకేశ్ ఆలోచన మారుతోందా..?

Mangalagiri: Lokesh Political Strategy Mangalagiri Ground Report

Nara Lokesh: నారా లోకేశ్ Nara Lokesh టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. పార్టీలో, నాయకుల్లో, శ్రేణుల్లో ఆయనపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో.. అందుకు తగ్గట్టుగానే ఆయన ముందుకెళ్తున్నారు. రీసెంట్ గా ఆయన పర్యటనలు చూస్తే ఇదే అర్ధమవుతోంది. అయితే.. ఆయన రాజకీయ పరిణితిపై ఇప్పటికీ ప్రతిపక్షాలు, సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. ఎమ్మెల్సీ హోదాలో గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో తొలిసారి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆయన చరిష్మాపై రాజకీయంగా అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పుడు 2024 ఎన్నికలకు ఈసారి మంగళగిరి నుంచి పోటీ చేసే విషయంలో తన నిర్ణయం మార్చుకున్నారని తెలుస్తోంది.

nara lokesh eyeing on that constitution
nara lokesh eyeing on that constitution

వచ్చే ఎన్నికల్లో ఆయన మంగళగిరి నుంచి కాకుండా ప్రత్యామ్నాయ నియోజకవర్గం కోసం చూస్తున్నట్టు సమాచారం. దీనిపై ఇప్పటినుంచే సర్వే చేయిస్తున్నారట కూడా. ఈక్రమంలో ఆయనకు విశాఖ జిల్లా భీమిలీ నియోజకవర్గం సేఫ్ అని భావిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో తనకు పరాభవం ఎదురైన మంగళగిరిని వదిలేయనున్నారని అంటున్నారు. రాజధాని ప్రాంతం కావడంతో అక్కడ గెలుపుపై ఆశలు పెట్టుకున్న లోకేశ్ కు అక్కడ ఓటమి ఆయనకే కాదు.. పార్టీకి కూడా పెద్ద షాక్ అనే చెప్పాలి. అందుకే ఎన్నికల్లో పోటీకి నియోజకవర్గ మార్పు ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే.. భీమిలీ మాత్రం లోకేశ్ కు ఎంత సేఫ్..? అనేదే ఇప్పుడు ప్రశ్న. భీమిలీ నుంచి వైసీపీ తరపున అవంతి శ్రీనివాసరావు బరిలో ఉన్నారు. పైగా.. ఆయనకు ఇది సొంత నియోజకవర్గం.

Read More: YSRCP: వైసీపీలో కొత్త బెంగ… ఆ 11 మంది ఎమ్మెల్సీలు ఎవరో, ఎప్పుడో..!?

2014లో భీమిలీ నుంచి గంటా శ్రీనివాసరావు టీడీపీ నుంచి గెలిచారు. 2019లో అక్కడ వైసీపీ నుంచి అవంతి శ్రీనివాసరావు గెలిచారు. స్థానిక బలం ఆయనకు కలిసొచ్చింది. అక్కడ టీడీపీకే పట్టు ఉంటే గంటా లేకపోయినా టీడీపీ గెలిచి ఉండాల్సింది. అలా జరగలేదు. 2024లో కూడా అవంతి భీమిలీ నుంచే పోటీ చేయడం ఖాయం. మరి ఈ నేపథ్యంలో లోకేశ్ భీమిలీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తే ఈసారి గెలుపు అవకాశాలెలా ఉంటాయో చూడాల్సిందే. ‘పోయినచోటే వెతుక్కుంటాను.. మంగళగిరిని వదిలిపెట్టను’ అని ఎన్నికల అనంతరం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు లోకేశ్. ఎన్నికలకు మరో మూడేళ్లు సమయం ఉన్నందున లోకేశ్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

 

 

Related posts

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju