NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

RRR: నాకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు!స్పీకర్ కు సుప్రీంకోర్టు తీర్పులతో సహా ఆర్ఆర్ఆర్ లేఖ

RRR: తన కేసు పార్టీ ఫిరాయింపుల నిరోధకచట్టం కిందకు రాదని, తాను ఏనాడూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని రెబల్ వైసిపి ఎంపి రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు.అందువల్ల తనను లోకసభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించవద్దంటూ ఆయన స్పీకర్ ఓం బిర్లాకు శుక్రవారం లేఖ రాశారు.ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పీకర్ కు ఒక లేఖ రాస్తూ తక్షణం రఘురామ కృష్ణంరాజును ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించాలని కోరడం తెలిసిందే.దీనిపై స్పందిస్తూ ఆర్ఆర్ఆర్ తాజాగా స్పీకర్ కు లేఖ రాశారు.విజయసాయి రెడ్డి పిటిషన్ లో పసలేదని ,తనను అనర్హుడిగా ప్రకటించడానికి కారణాలు లేవని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.అందువల్ల ఆయన లేఖను పక్కనపెట్టాల్సిందిగా స్పీకర్ ని రఘురామకృష్ణంరాజు కోరారు.

 RRR letter to the Speaker including Supreme Court judgments
RRR letter to the Speaker including Supreme Court judgments

ఆర్ ఆర్ ఆర్ వాదన ఏమిటంటే?

విజయసాయి రెడ్డి తన లేఖలో పేర్కొన్నట్లు తానెన్నడూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదన్నది రఘురామకృష్ణంరాజు వాదన.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని,ముఖ్యమంత్రిని పాలనలో జరుగుతున్న తప్పులను సరిదిద్దుకోవలసిందిగా మాత్రమే తాను కోరుతూ వస్తున్నానని,అవే సలహాలు ఇస్తున్నానని ఆయన స్పీకర్ కి రాసిన లేఖలో పేర్కొన్నారు.ఈ చర్య పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కిందకు రాదని ఆయన చెప్పారు.ఒక విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం పార్టీ వ్యతిరేక కార్యక్రమం కాదని కూడా ఆయన వాదించారు.తానెప్పుడు లోకసభ లో పార్టీ విప్ ను ధిక్కరించలేదని ఆయన స్పీకర్ కు తెలిపారు.పార్టీ ఫిరాయింపుల చట్టం కిందకు తన చర్యలు రావని చెబుతూ,ఆయన గతంలో ఇందుకు సంబంధించిన సుప్రీం కోర్టు తీర్పుల ప్రతులను కూడా తన లేఖకు జతపరిచారు.ఆ తీర్పులను పరిశీలిస్తే తనకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని ఎవరికైనా అర్థమైపోతుందని రఘురామకృష్ణం రాజు స్పీకర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఘాటుపదజాలంతో స్పీకర్ కి విజయసాయి లేఖ!

ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం విజయసాయిరెడ్డి ఘాటు పదజాలంతో లోక్ సభ స్పీకర్ కు ఒక లేఖ రాశారు.పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన ఎంపీ రఘురామ కృష్ణంరాజును అనర్హుడిగా ప్రకటించే విషయంలో ఎడతెగని జాప్యం జరుగుతుండడం పట్ల ఆయన ఒకరకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.పదకొండునెలల క్రితమే ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లేఖ ఇస్తే ఇంతవరకు దానిపై స్పీకర్ చర్య తీసుకోకపోవడాన్ని విజయసాయి రెడ్డి తన లేఖలో ప్రస్తావించారు.ఇందుకు ఆ లేఖలో దొర్లిన ఒక చిన్న సాంకేతిక తప్పుని స్పీకర్ కార్యాలయం కారణంగా చూపడాన్ని ఆయన ఖండించారు.నర్సాపురం లోకసభ నియోజకవర్గం ప్రజలు రఘురామకృష్ణంరాజు తమ ఎంపీగా కొనసాగడాన్ని ఇష్టపడ్డం లేదని, వెంటనే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని విజయసాయిరెడ్డి కోరారు.ఇరువర్గాల వాద, ప్రతివాదనలు విన్న స్పీకర్ ఏం చేస్తారో వేచి చూద్దాం.

 

Related posts

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !