Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డు స్థాయి ఓపెనింగ్స్ కాబట్టి హీరోలలో ముందువరుసలో మహేష్ ప్లేస్ ఉంటుంది. మహేష్ సినిమా హిట్ టాక్ వచ్చిందంటే చాలు.. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు కనుమరుగవడం గ్యారెంటీ. ఈ రీతిగానే పోకిరి, దూకుడు, శ్రీమంతుడు.. మహర్షి, భరత్ అనే నేను ఇంకా చాలా సినిమాలతో మహేష్ రికార్డులు హిస్టరీ క్రియేట్ చేయడం జరిగింది.
అటువంటి మహేష్ కి తాజాగా ఇండస్ట్రీలో ఒక టాప్ మోస్ట్ ప్రొడక్షన్ సంస్థ భారీ ఆఫర్ ఇవ్వడం జరిగింది అంట. విషయంలోకి వెళ్తే మహేష్ బాబు త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని నిర్మిస్తున్న హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాణ సంస్థ అధినేత .. మహేష్ బాబుకి కమ్యూనికేషన్ పరంగా ఇప్పటివరకు ఏ సినిమాకి తీసుకుని రీతిలో భారీ ఆఫర్ ఇవ్వడం జరిగింది అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
Read more: Mahesh Babu: మరోసారి మనసున్న శ్రీమంతుడు అనిపించుకున్న మహేష్ బాబు..!!
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. సినిమా చాలా వైవిధ్యమైన స్క్రిప్ట్ తో కూడినది కావడం తో.. నిర్మాత మహేష్ కి ఈ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన అతడు, ఖలేజా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మూడోసారి వీరి కాంబినేషన్లో సినిమా వస్తూ ఉండటంతో.. అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు ఈ ప్రాజెక్టు పై ఆసక్తి పెరిగింది.